Begin typing your search above and press return to search.
అమెరికా మసీదులకు షాకింగ్ లెటర్స్
By: Tupaki Desk | 28 Nov 2016 6:47 AM GMTఅమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ల అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ సంచలన విజయాన్నిసాధించిన సంగతి తెలిసిందే. అతివాదానికి అతి దగ్గరగా ఉండే ట్రంప్ గెలవటంతో ఆయన అభిమానులతో పాటు.. ఆయనకు మద్దతు పలికే వారికి పట్టపగ్గాలులేకుండా పోతున్న పరిస్థితి. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టేందుకు ట్రంప్ సిద్ధమవుతున్న వేళ.. కొంత మంది బాధ్యతల్ని విస్మరించి ఇష్టారాజ్యంగా వ్యాఖ్యలు చేస్తున్నారు.
గుట్టుచప్పుడు కాకుండా.. తమ పేర్లను వెల్లడి కాకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటూ రెచ్చిపోతున్నారు. తాజాగా అమెరికాలోని మసీదులకు పెద్ద ఎత్తున లేఖలు అందుతున్నాయి. అందులో ఉపయోగించే భాష దారుణంగా ఉండటమేకాదు.. ప్రస్తావించిన అంశాలు చదివితే బెదిరిపోవాల్సిందే. ట్రంప్ వచ్చాడు.. ఇక మీరు క్షణాలు లెక్క పెట్టుకునే రోజు వచ్చేసినట్లే.. యూదుల విషయంలో హిల్లర్ ఎలా చేశాడో.. ముస్లింల విషయంలో ట్రంప్ కూడా అలానే చేస్తాడంటూ వార్నింగ్ ఇస్తూ లెటర్స్ పంపుతున్నారు.
‘‘అమెరికన్స్ ఫర్ ఏ బెటర్ వే’’ పేరుతో వస్తున్న ఈ లేఖలు అగ్రరాజ్యంలో ఇప్పుడు కొత్త కలకలాన్ని సృష్టిస్తున్నాయి. చేతి రాతతో రాసిన ఈ లేఖలో అమెరికాలో నివిస్తున్నముస్లింలను ట్రంప్ ఉడ్చిపారేస్తారని.. నాడు హిట్లర్ యూదుల్ని ఏం చేశారో.. ట్రంప్ కూడా ముస్లింల విషయంలో అదే చేస్తాడంటూ దారుణమైన భాషను ఉపయోగిస్తూ రాసిన తీరు ఇప్పుడు కొత్త కలకలాన్ని రేపుతోంది. ఈ లేఖలో ముస్లింలను దుష్టులుగా.. దుర్మార్గులుగా చిత్రీకరించటమేకాదు.. సతాను వారసులుగా పేర్కొనటం గమనార్హం. ఇలాంటి చేష్టలపై ట్రంప్ రియాక్షన్ ఏమిటన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/