Begin typing your search above and press return to search.

మాస్క్ ను తప్పనిసరి చేయనన్న ట్రంప్!!

By:  Tupaki Desk   |   18 July 2020 9:50 AM GMT
మాస్క్ ను తప్పనిసరి చేయనన్న ట్రంప్!!
X
కరోనాను నియంత్రించాలంటే ఏకైక సాధనం మాస్క్ మాత్రమే. దీంతోపాటు చేతులను శుభ్రంగా కడుక్కోవడం.. సామాజిక దూరం పాటించడమే దాన్ని రాకుండా అడ్డుకునే మార్గాలు.. అయితే అమెరికాలో ఇప్పుడు మాస్క్ లు పెట్టుకోవడానికి జనాలు అస్సలు ఆసక్తి చూపించడం లేదు. దీంతో కరోనా కేసులు బాగా పెరుగుతున్నాయి.

ఈ క్రమంలో వైట్ హౌస్ టాస్క్ ఫోర్స్ సలహాదారు, అంటువ్యాధుల నివారణ నిపుణులు డాక్టర్ ఫౌసీ మాస్కులు అమెరికన్స్ అంతా పెట్టుకోవాలని పిలుపునిచ్చాడు. దీన్ని తప్పనిసరి చేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు సూచించారు. మాస్కులు పెట్టుకోకుంటే దేశంలో రానున్న రోజుల్లో పరిస్థితి తీవ్రమవుతుందని హెచ్చరించారు.

కానీ ట్రంప్ మాత్రం దేశంలో మాస్క్ తప్పనిసరి చేస్తూ అస్సలు ఆదేశాలు ఇవ్వనని.. తీవ్రత ఎంత ఉన్నా తాను సైతం మాస్క్ పెట్టుకోనని కుండబద్దలు కొట్టారు. ఇప్పటికీ మొన్న మిలటరీ ఆస్పత్రి సందర్శన అప్పుడు మాత్రమే ట్రంప్ మాస్క్ వాడారు.

ఇక మాస్కులు తప్పనిసరిపై అమెరికా రాజకీయ నేతలతోపాటు ప్రజలు కూడా రెండుగా చీలిపోయారు. కొంతమంది గవర్నర్లు పెట్టుకోమని సూచిస్తుంటే.. కొందరు వద్దంటున్నారు. ఇలా అగ్రరాజ్యంలో మాస్క్ చుట్టూ వివాదాలు కొనసాగుతున్నాయి.