Begin typing your search above and press return to search.
ఆ మహిళా నేతను దేశవ్యతిరేకిగా మార్చేశారు
By: Tupaki Desk | 30 April 2016 5:30 PM GMTమహిళలకు సమాన హక్కుల కోసమంటూ దేశాలయాలు, దర్గాల్లో ప్రవేశం కోసం ఆందోళనలు చేస్తున్న భూమాతా బ్రిగేడ్ నాయకురాలు తృప్తి దేశాయ్‌కు ఊహించని పోలిక దక్కింది. గత రెండు రోజులుగా తృప్తీ దేశాయ్ హిజీ అలి దర్గాలోనికి ప్రవేశించేందుకు చేస్తున్న ప్రయత్నాలు పోలీసులను ఉరుకులు - పరుగులు పెట్టిస్తున్నాయి. దీంతో ఆమెను ముంబై పోలీసులు మహారాష్ట్ర కన్హయ్య కుమార్ గా అభివర్ణించారు.
తాజాగా మీడియాతో మాట్లాడిన ముంబై డిప్యూటీ పోలీస్ కమిషనర్ మీడియాతో మాట్లాడుతూ తృప్తి దేశాయ్ సంప్రదాయాలు - నిబంధనల గురించి ఆమెకు ఎన్ని విధాలుగా వివరించినా వినడం లేదని అన్నారు. మహారాష్ట్ర కన్హయ్య కుమార్ గా తయారైందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రిని కలుసుకోవడానికి అనుమతి లేదని చెప్పినా అర్ధం చేసుకోవడం లేదన్నారు. మరోమారు తృప్తి దేశాయ్ కు సర్దిచెప్పే ప్రయత్నం చేస్తామని చెప్పారు.