Begin typing your search above and press return to search.

పీకేతో ఒప్పందం..క్లారిటీ ఇచ్చిన టీడీపీ!

By:  Tupaki Desk   |   14 Jun 2019 5:17 PM GMT
పీకేతో ఒప్పందం..క్లారిటీ ఇచ్చిన  టీడీపీ!
X
రాజకీయ వ్యూహకర్త - ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పని చేసిన ప్రశాంత్ కిషోర్ తో తెలుగుదేశం పార్టీ ఒప్పందం చేసుకుందన్న వార్తలు హాట్ టాపిక్ గా మారాయి. పీకేతో తెలుగుదేశం పార్టీకి రహస్య ఒప్పందం జరిగినట్టుగా ప్రచారం జరిగింది. మామూలుగా అలా ఒప్పందం కుదుర్చుకుని ఉంటే రొటీనే అయ్యేదేమో.

అయితే మొన్నటి వరకూ తెలుగుదేశం పార్టీ వాళ్లు అదే పీకేని ఎలా తిట్టారో అందరికీ తెలిసిందే. ప్రశాంత్ కిషోర్ పై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో సహా పచ్చ పార్టీ నేతలంతా దుమ్మెత్తి పోశారు. ఆయన బిహార్ డెకాయిట్ అంటూ విరుచుకుపడ్డారు. ఆయన కుల చిచ్చు పెడుతూ ఉన్నారని ధ్వజమెత్తారు.

ఇలాంటి నేపథ్యంలో తెలుగుదేశం వాళ్లు అదే పీకేతో ఒప్పందం కుదర్చుకున్నారు అనే ప్రచారం సంచలనమే రేపింది. ఈ ప్రచారం మరింతగా ముదరకనే తెలుగుదేశం పార్టీ స్పందించింది. తాము పీకేతో ఎలాంటి ఒప్పందం కుదుర్చుకోలేదని తెలుగుదేశం పార్టీ స్పష్టం చేసింది. ఈ విషయంలో జరుగుతున్న ప్రచారం అంతా ఉత్తిదే అని తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. ఆ పార్టీ ఎంపీ సీఎం రమేశ్ ఈ అంశం మీద స్పందించారు.

పీకేతో తమకు ఒప్పందం కుదిరిందనే వార్తలు అబద్ధం అని ఆయన చెప్పారు. తమకు ఎవరితోనూ ఒప్పందం కుదుర్చుకోవాల్సిన అవసరం లేదని కూడా ఆయన తేల్చారట. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ వాళ్లు ఓటమి మీద సమీక్షల్లో మునిగి తేలుతూ ఉన్నారు. ఈ విషయంలపై చంద్రబాబు నాయుడు కూడా ప్రత్యేక అధ్యయనాలు సాగిస్తూ ఉన్నారట. ఇందు కోసం కార్యకర్తలతో సమావేశాలు మరింతగా జరగబోతూ ఉన్నాయని సమాచారం. ప్రస్తుతం చంద్రబాబు ఆ పనుల్లో బిజీగా ఉన్నారని తెలుస్తోంది.