Begin typing your search above and press return to search.
కరోనా వేళ కేసీఆర్ డేరింగ్ నిర్ణయం!
By: Tupaki Desk | 17 Aug 2020 5:00 PM GMTకరోనాతో అన్నింటిని వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. సభలు, సమావేశాలకు అవకాశమే లేకుండా పోయింది. ఇప్పటికే తెలంగాణలో మంత్రులు, ఎమ్మెల్యేలు కరోనా బారిన పడుతున్న వేళ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
సోమవారం సీఎం కేసీఆర్ మంత్రులు, అధికారులతో ప్రగతిభవన్ లో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రానికి సంబంధించిన అంశాలు, బిల్లులు ఉన్నందున అసెంబ్లీ వర్షకాల సమావేశాలను నిర్వహించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. 20 రోజుల పాటు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు.
అసెంబ్లీ సమావేశాలకు సిద్ధం కావాలని మంత్రులు, అధికారులకు కేసీఆర్ దిశానిర్ధేశం చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో పలు బిల్లులు, తీర్మానాలు ప్రవేశపెట్టాలని.. ప్రభుత్వ నిర్ణయాలపై ప్రకటనలు కూడా చేయాల్సి ఉందని సిద్ధం కావాలని సూచించారు.
ఇక కరోనా వైరస్ నేపథ్యంలో నిబంధనలు, భౌతిక దూరం పాటించేలా అసెంబ్లీ హాలులో ఏర్పాటు చేయాలని శాసనసభా వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని, అసెంబ్లీ కార్యదర్శిని కేసీఆర్ ఆదేశించారు.
ముఖ్యంగా తెలంగాణ సచివాలయం నిర్మాణానికి సంబంధించిన ప్రకటన.. ఇతర కీలక బిల్లులు చర్చించేందుకు కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలు పెట్టినట్లు తెలుస్తోంది.