Begin typing your search above and press return to search.

కేసీఆర్ గెలుపునకు.. ఓటమికి మధ్య అంతరం ఇదే

By:  Tupaki Desk   |   1 Jan 2023 4:44 AM GMT
కేసీఆర్ గెలుపునకు.. ఓటమికి మధ్య అంతరం ఇదే
X
సమయం లేదు మిత్రమా? రణమా? శరణమా? అన్నట్టుగా కేసీఆర్ పరిస్థితి ఉంది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. కేసీఆర్ కు ఇప్పటికి కూడా తెలంగాణలో అంతో కొంత ఎడ్జ్ ఉంది. ఆ ఆధిక్యాన్ని తనకు తాను పాడు చేసుకుంటే తప్పితే ఎవరూ చెడగొట్టరు. అయితే ఒక మైనస్ ఏంటంటే.. టీఆర్ఎస్ పేరు బీఆర్ఎస్ గా మార్చడం.. ఉద్యమ సిద్ధాంతాన్ని పక్కనపెట్టడం.. రెండోవది సంఘర్షణ వాతావరణం సృష్టించడం.. కేంద్రంతో కొట్లాడడం అన్న స్ట్రాటజీ మాత్రం కేసీఆర్ చేటు తెస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కేంద్రం మారాలనుకుంటే.. బీజేపీ తీరు నచ్చకుంటే జనాలే వచ్చే ఎన్నికల్లో ఓట్లు వేయరు. తెలంగాణలో బీజేపీని జనాలు గత ఎన్నికల్లో గెలిపించలేదు కదా..? మరి ఎందుకు కేసీఆర్ భయపడుతున్నాడన్నది ప్రశ్న.

కేవలం మోడీని చూసి గెలిపించమని బీజేపీ నేతలు చెబుతున్నారు. కానీ కేవలం నన్ను చూసి గెలిపించండని కేసీఆర్ ఎందుకు అడగడం లేదన్నది ఇక్కడ ప్రశ్న. రైతు బంధు, రైతు బీమా, కల్యాణలక్ష్మీ, పెన్షన్లు, ఉద్యోగాలు ప్రకటన కూడా కేసీఆర్ చేశారు. ఇవన్నీ కూడా ప్రజల్లో చెరగని ముద్ర వేశాయి. ఇవే చెప్పడం కాదు.. ఇంకా ఏమేం చేయగలమో.. సౌకర్యాలు అందలేవో ఆ వర్గాలకు న్యాయం చేయడానికి కేసీఆర్ ప్రయత్నించాలి. ఇళ్ల నిర్మాణాలు, దళితులకు మూడెకరాలు సహా నెరవేర్చని హామీలపై ప్రజల్లో భరోసా కల్పించాలి. ఇంకా ఏమేం చేస్తామో ప్రజలకు వివరించాలి. ప్రజల్లో ఆ నైతికత పెంచుకోవడానికి ట్రై చేయాలి.

అయితే ఇదంతా పక్కనపెట్టి కేసీఆర్ ఒక నెగెటివిటీని పెంచుకుంటున్నారన్న చర్చ సాగుతోంది. ముఖ్యంగా హిందూ ఉదారవాదుల పట్ల కేసీఆర్ ఉదారంగా ఉండడమే కొంప ముంచుతోంది. వారి పట్ల కేసీఆర్ నిర్లక్ష్యం చేటు తెస్తోందన్న చర్చ సాగుతోంది.

ఈ తెలంగాణ ఒకప్పుడు నిజాం నవాబుల పట్ల సుధీర్ఘకాలంగా కొట్లాడిన ప్రాంతం. కాబట్టి అక్కడ ఖచ్చితంగా ఆ సెంటిమెంట్ అనేది బలంగా ఉంది. ఇప్పటికీ సజీవంగానే కనిపిస్తోంది. అయితే కేసీఆర్ ఆ ఒక వర్గాన్ని సంతృప్తి పరిచేందుకు చేస్తున్న చర్యలు రెండో వర్గంలో అసహనానికి దారితీస్తున్నాయి. ఆ అసహనాన్ని బీజేపీ క్యాష్ చేసుకుంటోంది. మనం ఎంత పూజలు చేసినా సరే.. అసలు పాయింట్ వరకూ వచ్చేసరికి తప్పు చేస్తున్నారు కేసీఆర్.

ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఇస్తున్న చేస్తున్న చర్యలతోపాటు ఇంకా ఏం చేస్తామన్నది కేసీఆర్ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఉపన్యాసాల్లో మోడీని విమర్శించవచ్చు. కానీ సేమ్ టైంలో బీజేపీ, కాంగ్రెస్ ను తిట్టడమే కాదు.. తాను ఏం చేయగలమన్నది చెబితేనే కేసీఆర్ విజయం సాధిస్తారు. ఆ దిశగా ఆలోచించినప్పుడే అంతిమలక్ష్యం నెరవేరుతుంది.