Begin typing your search above and press return to search.

ఎంసెట్ తేదీల ఖరారు.. ఈ తేది నుంచే..

By:  Tupaki Desk   |   23 May 2020 1:00 PM GMT
ఎంసెట్ తేదీల ఖరారు.. ఈ తేది నుంచే..
X
మహమ్మారి వైరస్ తో వచ్చిన నిర్బంధం కారణంగా విద్యావ్యవస్థ మొత్తం స్తంభించిపోయింది. పాఠశాలలు, కళాశాలలు మూతపడ్డాయి. చదువులు అటకెక్కాయి. పరీక్షలు లేకుండా పోయాయి. దీంతో భవిష్యత్తుపై ఆందోళనతో ఉన్న విద్యార్థులకు తాజాగా తెలంగాణ విద్యాశాఖ గుడ్ న్యూస్ చెప్పింది.

తెలంగాణలో ఎంసెట్ ప్రవేశ పరీక్షకు సంబంధించిన తేదీలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తాజాగా ప్రకటించారు. జులై 6 నుంచి 9వ తేదీ వరకు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు విద్యాశాఖ మంత్రి సబితా తెలిపారు.

శనివారం ఉన్నత విద్యామండలి చైర్మన్, విద్యాశాఖ కమిషనర్ సహా ప్రొఫెసర్లతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్షించారు. వైరస్ నిబంధనలకు లోబడి యూజీసీ ఇచ్చిన సలహాలకు అనుగుణంగా ఈ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి తెలిపారు. వైరస్ ప్రబలకుండా పరీక్షల సందర్భంగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కేసీఆర్ ఆదేశించడంతో ప్రత్యేక శ్రద్ధతో చర్యలు తీసుకున్నామని తెలిపారు.

ఇప్పటికే పదోతరగతి, ఇంటర్ పరీక్షల తేదీలు ఖరారయ్యాయి. ఇప్పుడు ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలపై శనివారం విద్యాశాఖ ప్రకటన జారీ చేసింది.

*ఉమ్మడి ప్రవేశ పరీక్షలు తేదీలు ఇవే..
- తెలంగాణ ఎంసెట్- జులై 6 నుంచి 9వ తేదీ వరకు
- తెలంగాణ ఈసెట్ : జులై 4వ తేది
- తెలంగాణ లాసెట్: జులై 10న
- టీఎస్ పీజీఈసెట్: జులై 1 నుంచి 3 వరకు
- టీఎస్ పాలిసెట్: జులై 1న
- ఐసెట్: జులై 13న
- ఎడ్ సెట్: జులై 15న