Begin typing your search above and press return to search.

తెలంగాణ సర్కార్ మరో వివాదాస్పద నిర్ణయం

By:  Tupaki Desk   |   24 Sep 2021 7:31 AM GMT
తెలంగాణ సర్కార్ మరో వివాదాస్పద నిర్ణయం
X
ఒక్కొక్కటిగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో ప్రభుత్వం ఆధ్వర్యంలో మాంసం విక్రయించేందుకు చర్యలు చేపట్టనుంది. ఈ మేరకు మాంసం దుకాణాలన్నీ ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొచ్చేందుకు కసరత్తులు మొదలు పెట్టారు. పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రం మొత్తం మాంసం దుకాణాలన్నీ ఇక ప్రభుత్వమే నిర్వహించనుంది. అంటే ప్రభుత్వం నుంచి మాంసం అందించగా దుకాణదారులు అక్కడి నుంచి కొనుగులో చేసి తమ షాపుల ద్వారా విక్రయించనున్నారు. దీని వల్ల వినియోగదారులకు శుద్ధమైన మాంసం లభించడమే కాకుండా ప్రభుత్వం నిర్ణయించిన ధరకే అందుబాటులోకి వస్తుంది.

రోగనిరోధక శక్తి పెంచుకునేందుకు ఇప్పటి వరకు శాఖాహారులు డ్రై ప్రూట్స్, మాంసాహారులు మటన్, చికెన్, ఫిష్ తింటున్నారు. అయితే మాసం ధరలు ఒక్కో ప్లేసును బట్టి ఒక్కో రకంగా ఉంటున్నాయి. దీని వల్ల సాధారణ ప్రజలు మటన్ కొనుక్కోలేకపోతున్నారు. అంతేకాకుండా కొందరు దుకాణదారులు నాణ్యమైన మాంసాన్ని అందించడం లేదు. దీని వల్ల రోగనిరోధక శక్తికి బదులు ఇతర రోగాలను కొనితెచ్చుకున్నట్లవుతుంది. ప్రజలకు ఆరోగ్యాన్ని ప్రసాదించడంలో భాగంగా ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలుపుతున్నాయి.

ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలో దాదాపు 10 వేలకు పైగా మాంసం విక్రయ కేంద్రాలున్నాయి. ఇందులో 2 వేలు మాత్రమే ప్రభుత్వ అనుమతితో నడుస్తున్నాయి. అయితే మొత్తం షాపులన్నీ ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొచ్చి వీటికి ప్రభుత్వమే మాంసం సరఫరా చేయనుంది. అంతేకాకుండా ప్రభుత్వం సరఫరా చేసిన మాంసాన్నే విక్రయించాలనే నిబంధన పెట్టనుంది. ఇందులో భాగంగా జోన్ పరిధిలో ఒక కళేబరాన్ని ఏర్పాటు చేసిన ఇక్కడి నుంచే మాంసాన్ని సరఫరా చేయనున్నారు. మాంసం దుకాణ దారులు ఇలా సరఫరా చేసిన దానినే విక్రయించాలి.

ప్రతీ మాంసం దుకాణంలో ఒక రిఫ్రిజిరేటర్ ను ఏర్పాటు చేస్తారు. అవసరమనుకుంటే వాటిని ఏర్పాటు చేసుకోవడానికి రుణ సౌకర్యం కూడా కల్పిస్తారు. అంతేకాకుండా మాంసం దుకాణాన్ని అభివృద్ధి చేసుకునేందుకు కూడా ప్రభుత్వం సాయం అందిస్తుంది. ఇలా ఏర్పాటు చేసిన రిఫ్రిజిరేటర్లో మాంసం ను ఉంచడం వల్ల ఎప్పుడూ తాజాగా ఉంటుంది. వినియోగదారులకు రిఫ్రిజిరేటలో నుంచి మాంసాన్ని తీసి ఇవ్వాలి. ఇక ప్రభుత్వం పరిస్థితులను భట్టి ధరను నిర్ణయిస్తుంది. ప్రభుత్వం నిర్ణయించిన ధరకే మాంస విక్రయించాలి. ఇలా చేయడం వల్ల వినియోగదారులకు తక్కువ ధరకే మంసం లభించడంతో పాటు నాణ్యమైన మాంసం లభించే ఆస్కారం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది.

కేవలం మాంసం మాత్రమే కాకుండా చేపలను కూడా ఇలాగే విక్రయించేలా సిద్ధం చేస్తోంది. ఇప్పటి వరకు ప్రభుత్వం ఉచితంగా చేపపిల్లలను పంపిణీ చేస్తున్నా వాటి ధరల విషయంలో తేడాలు ఉంటున్నాయి. అంతేకాకుండా ప్రత్యేకంగా చేపల మార్కెట్లు తక్కువగా ఉన్నాయి. మరోవైపు నిల్వ చేసుకునేందుకు సరైన సదుపాయాలు లేవు. దీంతో మాంసం దుకాణాలకు వీటిని కనెక్ట్ చేసి అన్నీ ఒకే దగ్గర లభించేలా ప్లాన్ చేస్తున్నారు. అవసరమనుకుంటే మత్స్యకారులకు దుకాణాల ఏర్పాటుకు ప్రభుత్వం సహకరించేలా ప్రణాళిక వేస్తున్నారు.

కేవలం జీహెచ్ఎంసీ పరిధిలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా మాంసం దుకాణాలు ప్రభుత్వ ఆధీనంలోకి రానున్నాయి. అయితే జిల్లాకు ఒకటి లేదా రెండు కళేబరాలను ఏర్పాటు చేసి ఇక్కడి నుంచి ఆయా ప్రాంతాలకు మాంసంను సరఫరా చేయనున్నారు. ఇలా చేయడం ద్వారా సామాన్యులు సైతం మాంసం కొనేందుకు వీలవుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం మాంసం దుకాణాలు గల్లకొకటి ఉన్నాయి. ఇక నుంచి అలా కాకుండా ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకున్న తరువాతే ఏర్పాటు చేయనున్నారు. ఆయన ప్రదేశం, పరిస్థితులను భట్టి మాంసం దుకాణం ఏర్పాటుకు అనుమతి ఇస్తారు.