Begin typing your search above and press return to search.

ట్యాపింగ్ లో టీ త‌ర‌ఫు జెఠ్మ‌లానీ వ‌క‌ల్తా..!

By:  Tupaki Desk   |   30 July 2015 8:57 AM GMT
ట్యాపింగ్ లో టీ త‌ర‌ఫు జెఠ్మ‌లానీ వ‌క‌ల్తా..!
X
సున్నిత‌మైన అంశాల్ని ఎలా డీల్ చేయాలో తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ తెలీని విష‌యం కాదు. గుట్టుగా సాగిన పోన్ ట్యాపింగ్ వ్య‌వ‌హారం బ‌జార్లో ప‌డ‌టంతో పాటు.. న్యాయ‌ప‌ర‌మైన చిక్కులు ముసురుకుంటున్న వేళ‌.. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఒక ప్ర‌ముఖుడిపై ఆధార‌ప‌డిన‌ట్లు క‌నిపిస్తోంది.

వివాదాస్ప‌ద అంశాలు.. క్లిష్ట‌మైన ప‌రిస్థితుల్లో అంద‌రికి గుర్తుకు ప్ర‌ముఖ న్యాయ‌వాది రాం జెఠ్మాలానీ.. తాజాగా కేసీఆర్ కు గుర్తుకు వ‌చ్చారు. ఏపీకి చెందిన ప్ర‌ముఖ‌ల ఫోన్ల‌ను ట్యాప్ చేశార‌న్న ఆరోప‌ణ‌పై విజ‌య‌వాడ కోర్టు.. టెలికం ఆప‌రేట‌ర్ల‌కు కాల్ డేటా స‌మాచారం ఇవ్వాల‌ని చెప్ప‌టం.. దానిపై స్టే కోసం టెలికం కంపెనీలు సుప్రీంను ఆశ్రయించ‌టం.. ఈ సంద‌ర్భంగా టీ స‌ర్కారు చెబితేనే తాము ట్యాపింగ్ చేసిన‌ట్లుగా పేర్కొన‌టం తెలిసిందే.
ఇలా.. ఒక‌టి త‌ర్వాత ఒక‌టిగా ట్యాపింగ్ వ్య‌వ‌హారంలో పీక‌ల్లోతు ఒత్తిడిలో కూరుకుపోయిన టీ స‌ర్కారు తాజాగా హైకోర్టులో ఒక వ్యాజ్యం వేసిన సంగ‌తి తెలిసిందే. ఫోన్ ట్యాపింగ్ రికార్డులు ఏపీ స‌ర్కారుకు ఇవ్వొద్దంటూ హైకోర్టులో పిటీష‌న్ దాఖ‌లు చేశారు. దీనికి సంబంధించి తెలంగాణ స‌ర్కారు త‌ర‌ఫున వాద‌న‌ల్ని వినిపించేందుకు ప్ర‌ముఖ న్యాయ‌వాది రాం జెఠ్మాలానీ వ‌కల్తా పుచ్చుకున్నారు.

కాల్ డేటా ఇవ్వాల‌ని ఆదేశించే అధికారం విజ‌య‌వాడ కోర్టుకు లేదంటూ రాంజెఠ్మాలానీ వాదించారు. ఇక‌.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ త‌ర‌ఫున వేణుగోపాల్ త‌న వాద‌న‌ల్ని వినిపించారు. ఇక‌.. కేంద్రం తరపున సొలిసిటర్‌ జనరల్‌ నటరాజన్‌ వాదనలు వినిపించారు. ఇరు ప‌క్షాల వాద‌న‌ల్ని విన్న హైకోర్టు త‌న నిర్ణ‌యాన్ని గురువారం సాయంత్రం నాలుగు గంట‌ల‌కు ప్ర‌క‌టించ‌నున్న‌ట్లుగా వెల్ల‌డించింది. ట్యాపింగ్ టేపుల విష‌యంపై సీన్లోకి రాంజెఠ్మాలానీని టీ స‌ర్కారు తీసుకురావ‌టం ద్వారా.. ఈ ఉదంతానికి ఎంత ప్రాధాన్య‌త ఇస్తుందో ఇట్టే తెలుస్తుంది. ఇరు ప‌క్షాల వాద‌న‌లు విన్న హైకోర్టు త‌న నిర్ణ‌యాన్ని సాయంత్రం నాలుగు గంట‌ల‌కు వెల్ల‌డిస్తామంటూ వాయిదా వేసింది.