Begin typing your search above and press return to search.
పదునెక్కిన కేసీఆర్ కొరడా.. తాజాగా వేటు పడిన కార్పొరేట్ ఆసుపత్రులు ఇవే
By: Tupaki Desk | 2 Jun 2021 7:00 AM GMTకరోనా చికిత్సకు సంబంధించి రోగుల వద్ద నుంచి భారీ ఎత్తున వసూళ్లకు పాల్పడుతున్న ప్రైవేటు.. కార్పొరేట్ ఆసుపత్రులపై కొరడా ఝుళుపుతోంది కేసీఆర్ సర్కారు. ఇప్పటికే మూడు దఫాలుగా కొవిడ్ వైద్యసేవల అనుమతుల్ని రద్దు చేసిన ప్రభుత్వం.. తాజాగా మరికొన్ని ఆసుపత్రులపై వేటు వేశారు. అయితే.. ఈసారి ప్రత్యేకత ఏమంటే.. బడా కార్పొరేట్ ఆసుపత్రులు వేటు బారిన పడటం.
కరోనా సెకండ్ వేవ్ వేళ.. రోగుల నుంచి అత్యధికంగా బిల్లులు వసూలు చేయటం.. ప్రభుత్వ నిబంధనల్ని పాటించకపోవటం తెలిసిందే. దీనిపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. బిల్లుల దోపిడీపై ఇప్పటివరకు 113 ఆసుపత్రులపై 174 ఫిర్యాదులు రాగా.. పలు ఆసుపత్రులపై చర్యలు తీసుకున్నారు. మంగళవారం ఒక్కరోజునే ఎనిమిది కంప్లైంట్లు రావటం గమనార్హం. ఇదిలా ఉండగా..తమకు వచ్చిన ఫిర్యాదులపై స్పందించిన అధికారులు చర్యలకు తెర తీశారు.
తాజాగా ఆరు ఆసుపత్రులకు కొవిడ్ చికిత్సను అందించకూడదని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే సదరు ఆసుపత్రుల్లో ఉన్న పేషెంట్లకు వైద్యం అందించొచ్చు కానీ.. కొత్తగా రోగుల్ని చేర్చుకోకూడదని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే.. మంగళవారం హైకోర్టు అత్యధిక బిల్లులు వసూలు చేసే ప్రైవేటు.. కార్పొరేట్ ఆసుపత్రుల అనుమతులు రద్దు చేసే బదులు.. వారు వసూలు చేసిన సొమ్ముల్ని వెనక్కి ఇప్పించటం అని పేర్కొంది. అందుకు భిన్నంగా అధికారులు వేటు వేయటం గమనార్హం.ఈసారి వేటు పడిన ఆసుపత్రుల్లో కొన్ని హైదరాబాద్ లోనే పేరున్న కార్పొరేట్ ఆసుపత్రులు ఉండటం గమనార్హం. ఇంతకూ అవేమంటే..
1. సికింద్రాబాద్ కిమ్స్
2. గచ్చిబౌలిలోని సన్ షైన్
3. బంజారాహిల్స్ లోని సెంచురీ
4. లక్డీకాపూల్ లోని లోటస్ హాస్పిటల్
5. ఎల్బీనగర్ లోని మెడిసిస్ హాస్పిటల్
6. టౌలిచౌకీలోని ఇంటిగ్రో హాస్పిటల్