Begin typing your search above and press return to search.
ఇది మహిళల మదిని గెలుచుకునేందుకేనా కేటీఆర్
By: Tupaki Desk | 1 Dec 2017 5:07 AM GMTతెలంగాణ రాష్ట్ర ఐటీ - పరిశ్రమల శాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు మహిళల మదిని గెలుచుకునేందుకు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో కేవలం మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి...ప్రత్యేకంగా మూడు పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి దేశంలోనే ప్రప్రథమంగా వీ-హబ్ ను రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. మూడ్రోజులపాటు నిర్వహించిన గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సమ్మిట్ విజయవంతంగా ముగిసిన సందర్భంగా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. టీ-హబ్ తరహాలోనే విమెన్ ఎంటర్ ప్రెన్యూర్స్ హబ్ ను తీర్చిదిద్దుతున్నట్లు ప్రకటించారు.
జీఈ సదస్సులో పాల్గొన్న వారి ప్రసంగాల ద్వారా మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తల నిధుల సమస్య ఏర్పడుతున్నదనే విషయం అర్థమైందన్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి దేశంలోనే ప్రప్రథమంగా వీ-హబ్ కు శ్రీకారం చుడుతున్నామని తెలిపారు. వీ-హబ్ కు రూ.15 కోట్ల కార్పస్ నిధిని కేటాయిస్తున్నట్టు తెలిపారు. దీనిద్వారా మహిళా పారిశ్రామికవేత్తల సంస్థల్లో రూ.25 లక్షల నుంచి కోటి దాకా పెట్టుబడి పెడుతామని వివరించారు. ఇందుకోసం ప్రొక్యూర్ మెంట్ పాలసీని బలోపేతం చేస్తామని చెప్పారు. ప్రైవేటు ఎంఎస్ ఎంఈల ద్వారా 20% సొమ్మును సేకరిస్తామన్నారు. దక్షిణాసియాలో వైభవంగా జీఈఎస్ సదస్సు జరిగిందని.. ప్రపంచవ్యాప్తంగా 140 దేశాల ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారని కేటీఆర్ తెలిపారు. ఇందులో మహిళలే 52.5% వరకు ఉన్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో, తమ ప్రభుత్వం మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు విప్లవాత్మకమైన విధానాలకు పెద్దపీట వేస్తుందని తెలిపారు. ప్రపంచ మహిళా పారిశ్రామికవేత్తల నుంచి స్ఫూర్తి పొంది.. నారీమణుల కోసం ప్రత్యేక హబ్ ను ప్రారంభిస్తున్నామన్నారు. తెలంగాణలో ఇప్పటికే మహిళలకే మూడు ప్రత్యేక పార్కులను ఏర్పాటుచేసిన ఘనత తమకే దక్కుతుందన్నారు.
ప్రధాని మోడీ - అమెరికా అధ్యక్షురాలి తనయ ఇవాంకా ట్రంప్ లు తెలంగాణ రాష్ట్రం వినూత్న ఆవిష్కరణల గురించి ప్రస్తావించారంటే తమ రాష్ట్రం ప్రత్యేకత ప్రపంచవ్యాప్తంగా అర్థమైందని కేటీఆర్ అన్నారు. ఇప్పటికే టీహబ్ ద్వారా గోవా - త్రిపుర - ఢిల్లీ - అసోం వంటి నాలుగు రాష్ట్రాలకు తమ సేవలను అందిస్తున్నామని తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద టెక్నాలజీ ఇంక్యుబేటర్‌ను వచ్చే ఏడాది ప్రారంభిస్తున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ జీఈ సదస్సు స్వాగతోపన్యాసంలో ప్రకటించారని గుర్తుచేశారు.