Begin typing your search above and press return to search.
కరోనా రెండో దశ ముప్పు పొంచి ఉంది..ప్రభుత్వానికి హైకోర్టు చురకలు
By: Tupaki Desk | 19 Nov 2020 3:50 PM GMTతెలంగాణ లో కరోనా మహమ్మారి వ్యాప్తి , ఆ మహమ్మారిని అరికట్టడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలేవి , అలాగే రాష్ట్రంలో ప్రతిరోజూ ఎన్ని కరోనా నిర్దారణ పరీక్షలు చేస్తున్నారు వంటి తదితర అంశాలపై నేడు తెలంగాణ హైకోర్టు లో విచారణ జరిగింది. అయితే , ఈ విచారణ లో భాగంగా హైకోర్టు ప్రభుత్వం అసహనం వ్యక్తం చేసింది. కేవలం కోర్టులో కేసు విచారణకు ముందు కేసులు పెంచి తర్వాత తగ్గిస్తున్నట్లు అర్థమౌతుందని హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్రంలో రోజుకు 50వేల కొవిడ్ పరీక్షలు చేయాలని.. ఆ సంఖ్యను లక్ష వరకు పెంచాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది.
ఇక ,రాష్ట్రంలో కరోనా రెండో దశ ముప్పు పొంచి ఉందని, ఇలాంటి సమయంలో ప్రతి ఒక్కరు సామజిక దూరం, పేస్ మాస్కులు ధరించడం వంటి మార్గదర్శకాలు సరిగా అమలు చేయాలని , ప్రస్తుతం సరిగా అమలు కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా మార్గదర్శకాలు కచ్చితంగా అమలు చేయాలని.. మార్గదర్శకాలు పాటించేలా ప్రజలను ఆదేశించాలని తెలిపింది. కరోనా చికిత్స పేరుతో ప్రైవేటు ఆస్పత్రుల్లో అధిక మొత్తంలో బిల్లులు వసూలు చేసిన ఆస్పత్రులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో వివరించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కరోనాపై డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ప్రణాళికలు ఎందుకు సమర్పించడం లేదని హైకోర్టు ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేసింది. ఈ నెల 24లోగా పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని ఉన్నత న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశించింది.