Begin typing your search above and press return to search.
మేడారం జాతరకు..హెలికాఫ్టర్లలో వెళ్లొచ్చు
By: Tupaki Desk | 29 Jan 2016 8:10 AM GMTతెలంగాణ వ్యాప్తంగా ప్రతి రెండేళ్లకోమారు అత్యంత వైభవంగా నిర్వహించే సమ్మక్క.. సారలమ్మ జాతరకు లక్షలాది ప్రజలు హాజరవుతుంటారు. తెలంగాణ ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో కొలుస్తుంటారు. మిగిలిన జాతరలకు.. సమ్మక్క..సారలమ్మల జాతరకు ఒక ఇబ్బంది ఉంటుంది. వరంగల్ జిల్లాలోని మారుమూల ప్రాంతంలో జరిగే ఈ జాతకు ప్రయాణం కాస్త ఇబ్బందే. దీనికి తోడు లక్షలాదిగా వచ్చే జనసందోహంతో ట్రాఫిక్ జాంలు చోటు చేసుకోవటం మామూలే.
ప్రభుత్వాలు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. జాతర కష్టాలు మామూలే. అయితే.. ఈసారి అలాంటి కష్టాలు కొంతమేర తగ్గే వీలుంది. కాసింత డబ్బులు ఖర్చు పెట్టే స్తోమత ఉండాలే కానీ.. ప్రయాణ సమయాన్ని భారీగా తగ్గించటంతో పాటు.. ఒళ్లు కదలకుండా జాతరకు వెళ్లే అవకాశం కలగనుంది. ఈసారి జాతరకు హెలికాఫ్టర్ సౌకర్యం అందుబాటులోకి రానుండటమే దీనికి కారణం. ఢిల్లీకి చెందిన స్కై చుపీస్ లాజిస్టిక్ కంపెనీతో కలిసి ఇన్డ్ వెల్ అనే సంస్థ హెలికాఫ్టర్ సౌకర్యం కల్పించేందుకు ఏర్పాట్లు షురూ చేయనుంది.
హైదరాబాద్.. వంరగల్.. ములుగు నుంచి ఒక్కో హెలికాఫ్టర్ చొప్పున నడపాలన్న ప్రణాళికల్ని సిద్ధం చేశారు. అనుకున్నది అనుకున్నట్లు జరిగితే.. ఈ మేడారం జాతరలో హెలికాఫ్టర్ సౌకర్యంలో ప్రయాణానికి ఇబ్బంది పడే వారు సైతం సులభంగా అమ్మవార్త గద్దెల వద్దకు చేరుకొని.. దర్శనం చేసుకునే వెసులుబాటు దక్కనుంది.