Begin typing your search above and press return to search.
సరి..బేసిలు చాలా సింపుల్ అంటున్న చీఫ్ జస్టిస్
By: Tupaki Desk | 7 Dec 2015 4:06 AM GMTఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న వినూత్న నిర్ణయానికి సాధారణ ప్రజానీకం స్పందన బయటకు రాకున్నా.. అత్యున్నత న్యాయ్థానమైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్పందన మాత్రం వచ్చేసింది. వాహనం చివరన ఉన్న బేసి సంఖ్య వాహనాల్ని ఒక రోజు.. సరి సంఖ్యల వాహనాల్ని మరో రోజు చొప్పున రోడ్ల మీదకు అనుమతించే నిర్ణయం మీద సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్ సమర్థించారు. ఈ నిర్ణయం తమకు ఓకేనని.. సుప్రీంకోర్టు జడ్జిలందరూ పాటిస్తారంటూ చెప్పేశారు.
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ లాంటి స్థాయి వ్యక్తి నుంచి సానుకూల స్పందన రావటం ఆసక్తి వ్యక్తమవుతోంది. తాజాగా ఆయన మీడియాను కలిసిన సందర్భంగా కేజ్రీవాల్ సర్కారు తీసుకున్న నిర్ణయంపై ఆయన సమర్థిస్తూ.. కార్లను త్యాగం చేయటం కాదని.. ఢిల్లీలోని కాలుష్య తీవ్రత భారీగా ఉన్న నేపథ్యంలో కట్టడి చేయాల్సిన అవసరం ఉందన్న వాదనను వినిపించారు.
సుప్రీంకోర్టు న్యాయమూర్తులు దీనికి కట్టుబడి ఉంటారా? అని ప్రశ్నిస్తే.. కాలుష్యాన్ని తగ్గించేందుకు సాయం చేస్తుందంటే.. మేం కూడా అలా చేయటానికి సంతోషంగా ముందుకు వస్తామని.. ఇది త్యాగం కాబోదని.. ప్రస్తుత పరిస్థితి తీవ్రతకు అద్దం పట్టే సందేశం మాత్రమేనని చెప్పారు.
ప్రాక్టికల్ గా ఈ నిబంధనను ఎలా అనుసరిస్తారన్న మాటకు చీఫ్ జస్టిస్ చాలా సింఫుల్ గా విషయాన్ని తేల్చేశారు. ‘‘నావరకు నాకు మాత్రం కారు నెంబరుతో సంబంధం లేదు. ఒక రోజు నేను నా కారులో వస్తా. మరో రోజు నా కోలీగ్ జడ్జి సిక్రీ కారులో కోర్టుకు చేరుకుంటా’ అని తేల్చేశారు. అందరికి సిక్రీ లాంటి కోలీగ్ దొరకొద్దు.