Begin typing your search above and press return to search.

అశ్వత్థామరెడ్డికి మరోసారి షాకిచ్చిన ఆర్టీసీ

By:  Tupaki Desk   |   5 Jan 2020 5:04 AM GMT
అశ్వత్థామరెడ్డికి మరోసారి షాకిచ్చిన ఆర్టీసీ
X
ఉద్యమ నేతల్ని ఉద్యోగం చేయమంటే వారు పడే ఇబ్బంది అంతా ఇంతా కాదు. ఎంజీబీఎస్ లో కంట్రోలర్ గా వ్యవహరించే అశ్వత్థామరెడ్డిని.. ఆయన చేసే ఉద్యోగంతో కంటే కూడా యూనియన్ నేతగానే ఆర్టీసీ ఉద్యోగులు గుర్తిస్తారు. సుదీర్ఘంగా సాగిన ఆర్టీసీ సమ్మె.. చివరకు ఎలా ముగిసిందన్న సంగతి తెలిసిందే.

ఆర్టీసీ సమ్మెను ముందుండి నడిపిన అశ్వత్థామరెడ్డికి తిరుగులేని రీతిలో షాకిచ్చిన సీఎం కేసీఆర్.. సమ్మెకు నాయకత్వం వహించిన నేతలతో పని లేకుండా.. వారి పరోక్షంలో సమ్మెకు పుల్ స్టాప్ పెట్టేలా పావులు కదపటం తెలిసిందే.సమ్మె ముగిసిన తర్వాత.. రెగ్యులర్ గా ఉద్యోగం చేయాల్సిన పరిస్థితిని అశ్వత్థామరెడ్డికి కలిగించారు. దీంతో.. షాక్ తిన్న ఆయన.. సెలవు తీసుకోవాలని భావించారు.

అయితే.. సంస్థ నష్టాల్లో నడుస్తుందని.. ఇలాంటివేళ సెలవులు ఇవ్వటం కుదరదని తేల్చింది. అయినప్పటికీ ఉద్యోగం చేసేందుకు ఆసక్తిని ప్రదర్శించని ఆయన.. తాజాగా మరోసారి సెలవుల ప్రతిపాదనను తెర మీదకు తీసుకొచ్చారు. ఈసారి ఆర్నెల్ల పాటు వేతనం లేకుండా సెలవు ఇవ్వాలని అశ్వత్థామరెడ్డి మరోసారి అప్లికేషన్ పెట్టుకున్నారు. దాన్ని కూడా రిజెక్టు చేస్తున్నట్లుగా చెప్పిన ఆర్టీసీ యాజమాన్యం యూనియన్ నేతకు షాకిచ్చింది.మొత్తంగా ఆర్టీసీ యూనియన్ల జేఏసీ కన్వీనర్ కమ్ టీఎంయూ ప్రధాన కార్యదర్శి అయిన అశ్వత్థామరెడ్డికి వరుస షాకులు తప్పట్లేదు. మరీ.. నేపథ్యంలో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.