Begin typing your search above and press return to search.
అశ్వత్థామరెడ్డి సంచలనం... కేసీఆర్ కు బల్బులు పగిలే ట్విస్ట్ ఇచ్చేశారు!
By: Tupaki Desk | 2 Nov 2019 5:04 PM GMTతెలంగాణ ఆర్టీసీ సమ్మె రోజుకో మలుపు తిరుగుతోంది. ఏపీలో మాదిరిగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న ప్రధాన డిమాండ్ తో పాటు మరి కొన్ని డిమాండ్ల సాధనకు ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే. ఈ సమ్మెపై తెలంగాణ సీఎం హోదాలో ఉన్న టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు దాదాపుగా ఉక్కుపాదం మోపినట్లుగానే కనిపిస్తున్నారు. కార్మికుల డిమాండ్లను పరిష్కరించే సమస్యే లేదని, అయినా ప్రభుత్వ అనుమతి లేకుండా విధులకు డుమ్మా కొట్టిన దాదాపుగా 50 వేల మంది కార్మికులను ఉద్యోగాల్లో నుంచి తప్పేంచేసినట్టేనన్న రీతిలో కేసీఆర్ సాగుతున్నారు. ఈ క్రమంలో అటు వైపు కార్మికులు కూడా వెనక్కు తగ్గేలా కనిపించడం లేదు. మొత్తంగా సమ్మె ఇప్పుడప్పుడే ముగిసే సూచనలు కూడా కనిపించడం లేదు. ఇలాంటి తరుణంలో ఆర్టీసీ జేఏసీ కన్వీర్ గా ఉన్న అశ్వత్థామరెడ్డి శనివారం నాడు కేసీఆర్ కు అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చేశారు. అసలు తమను తొలగించడం గానీ, తమను ఉద్యోగాల్లో నియమించడం గానీ... ఆర్టీసీ సంబంధించి ఏ నిర్ణయం కూడా తీసుకునే హక్కు గానీ, అధికారం గానీ తెలంగాణ ప్రభుత్వానికి లేవని, కేసీఆర్ కు ఆ అధికారి అసలే లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే గియితే... తమకు సంబంధించి ఏ నిర్ణయమైనా తీసుకునే అధికారం ఏపీ సీఎంగా కొనసాగుతున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికే ఉందన్న కోణంలో ఆయన చేసిన వ్యాఖ్యలతో నిజంగానే కేసీఆర్ కు మైండ్ బ్లాంక్ అయ్యిందని చెప్పక తప్పదు.
అయినా కేసీఆర్ కు మైండ్ బ్లాంక్ అయ్యేలా అశ్వత్థామరెడ్డి ఏమన్నారన్న విషయానికి వస్తే... తెలుగు నేల రెండు రాష్ట్రాలుగా విడిపోయిన నేపథ్యంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న సంస్థలన్నీ రెండుగా విడిపోయాయి కదా. అయితే షెడ్యూల్ 9 -10 కింద ఉన్న సంస్థల విభజన ఇంకా పూర్తి కాలేదు. ఆర్టీసీ కూడా రెండుగా విడిపోలేదు. కేవలం ఎక్కడి బస్సులు అక్కడ, ఎక్కడి కార్మికులు అక్కడ, ఎక్కడి ఆస్తులు ఆక్కడ అన్న ప్రాతిపదికగానే ఉమ్మడి ఆర్టీసీ విభజన జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటిదాకా ప్రత్యేకించి ఉత్తర్వులు గానీ, గెజిట్లు గానీ విడుదల కాలేదు. అసలు ఆర్టీసీ విభజనకు సంబంధించి సింగిల్ పేపర్ కూడా వెలువడలేదు. ఇదే అంశాన్ని ప్రస్తావించిన అశ్వత్థామరెడ్ది... అసలు ఉమ్మడి రాష్ట్రంలో ఏపీఎస్ఆర్టీసీగా కొనసాగిన ఆర్టీసీ... తెలుగు నేల రెండు రాష్ట్రాలుగా విడిపోయినా... ఆర్టీసీ మాత్రం ఇంకా విడిపోలేదని, ఈ నేపథ్యంలో ఇప్పటికీ తామంతా ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులమేనని సంచలన వ్యాఖ్య చేశారు. ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులుగా ఉన్న తమకు సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకునే హక్కు తెలంగాణ ప్రభుత్వానికి లేదని, తెలంగాణ సీఎంగా ఉన్న కేసీఆర్ కు అసలే లేదని కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే గియితే తమకు సంబంధించి ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా... ఏపీ సీఎం హోదాలో ఉన్న జగన్ కే ఉందన్న కోణంలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
జగన్ పేరును అశ్వత్థామరెడ్డి ప్రస్తావించలేదు గానీ... కేసీఆర్ కు అధికారం లేదని చెప్పడంతో పాటుగా తామింకా ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులుగానే కొనసాగుతున్నామని ఆయన చెప్పడం చూస్తుంటే... తెలంగాణ ఆర్టీసీ అన్నదే లేదని, తెలంగాణ ఆర్టీసీ లేకుంటే... తామంతా ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగుల కిందే లెక్క కదా అన్న భావన వ్యక్తమయ్యేలా ఆయన చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే... తమకు సంబంధించిన ఏ నిర్ణయం అయినా తీసుకునే అధికారం ఏపీ సీఎంగా ఉన్న ఒక్క జగన్ కే ఉందని ఆయన చెప్పేసినట్టే కదా. కేసీఆర్ పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఆయనకే అధికారం లేదన్న రీతిలో అశ్వత్థామరెడ్డి చేసిన వ్యాఖ్యలు... ఆచరణలో సాధ్యమయ్యే పని కాదు గానీ... రాతకోతలు లేకుండానేే ఆర్టీసీని విభజించేసినట్టుగా, ఆ సంస్థకు చెందిన తెలంగాణలో ఆస్తులన్నీ తెలంగాణకే చెందినవిగా చెప్పుకుంటున్న కేసీఆర్ కు... ఇప్పుడు అశ్వత్థామరెడ్డి సందించిన ప్రశ్నలు నిజంగానే ఆసక్తి కలిగిస్తున్నాయని చెప్పక తప్పదు. ఓ జిల్లాలోని ఓ చిన్న గ్రామాన్ని ఇతర జిల్లాకో, ఇతర రాష్ట్రానికో, లేదంటే ఇతర మండలానికో మార్చాలంటేనే పెద్ద ఎత్తున కసరత్తు జరుగుతుంది కదా. అలాంటిది వేల కోట్ల ఆస్తులున్న ఆర్టీసీని రాతకోతలు లేకుండానే విభజించేశామని ప్రకటించేసిన కేసీఆర్ కు ఇప్పుడు అశ్వత్థామరెడ్డి వ్యాఖ్యలతో నిజంగానే బల్బులు పగిలిపోయాయని చెప్పక తప్పదు.