Begin typing your search above and press return to search.

గుడ్ న్యూస్: ఆర్టీసీ బ‌స్సులు రోడ్డెక్క‌నున్నాయి

By:  Tupaki Desk   |   17 May 2020 12:30 PM GMT
గుడ్ న్యూస్: ఆర్టీసీ బ‌స్సులు రోడ్డెక్క‌నున్నాయి
X
క‌రోనా క‌ల‌క‌లం నేప‌థ్యంలో విధించిన లాక్ డౌన్ ప‌ర్వంలో నిబంధ‌న‌లు ఒక్కొక్క‌టిగా స‌డ‌లిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఓ వైపు మూడో విడ‌త లాక్ డౌన్ గ‌డువు ముగుస్తుండ‌గా మ‌రోవైపు తాజాగా 4.0 తెర‌మీద‌కు వ‌చ్చింది. ఈ స‌మ‌యంలో అందుబాటు‌లోకి వ‌చ్చే సేవ‌ల గురించి ఆస‌క్తి నెల‌కొంది. ఇలాంటి త‌రుణంలో ఓ తీపిక‌బురు వినిపిస్తోంది. అదే ఆర్టీసీ సేవ‌లు ప్రారంభం. తెలంగాణలో ఆర్టీసీ సేవ‌లు ప్రారంభం కానున్నాయి. లాక్ డౌన్‌ ఎత్తివేతతో పాటు ప్రభుత్వ ఆదేశాలు అందిన వెంటనే ప్రధాన రూట్లలో బస్సులు నడిపేందుకు గ్రేటర్‌ ఆర్టీసీ సిద్ధ్దమవుతోంది.

క‌రోనా వైర‌స్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకునే ఆర్టీసీ సేవ‌లు ఉంనున్న‌ట్లు తెలుస్తోంది. గ్రేటర్ హైద‌రాబాద్‌‌ ఆర్టీసీ పరిధిలోని 29డిపోల నుంచి నడిచే బస్సులన్నీ ప్రధాన మార్గాల్లోనే ప్రయాణ సౌకర్యాన్ని అందించనున్నాయి. బ్రాంచ్‌ రూట్లు(ప్రధాన రూట్లకు అనుసంధానంగా కాలనీలకు నడిచే బస్సులను) నిలిపివేయనున్నారు. కరోనా నేపథ్యంలో భౌతిక దూరం పాటించాల్సిన అవసరం ఏర్పడడంతో దీనికి త‌గిన‌ట్లుగా బస్సుల్లో 70 మందికి బదులుగా 30 మంది మాత్రమే ప్రయాణించనున్నారు. దీంతో పాటుగా బస్సులోని సీట్లలో కొన్ని మార్పులు చేస్తున్నారు. ముఖ్యంగా కండక్టర్లు, డ్రైవర్లపై కరోనా ప్రభావం పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

భౌతిక దూరం పాటించేందుకు ప్రయాణికులు బస్సు ఎక్కగానే ఏ సీట్లో కూర్చోవాలనే అంశంపై కూడా ఆర్టీసీ స్పష్టత ఇవ్వనుంది. సీట్లపై రైట్‌ అండ్‌ రాంగ్‌ మార్కింగ్‌ ఏర్పాటు చేస్తారు. రైట్‌ మార్కు ఉన్న సీటుపై ప్రయాణికుడు కూర్చోవాల్సి ఉండగా, రాంగ్ ‌అనే సింబల్‌ ఉన్న సీటులో కూర్చోవడానికి అనుమతి లేదు. మ‌రోవైపు - డ్రైవ‌ర్లు - కండ‌క్ట‌ర్ల సేవ‌లు సైతం ఇదే రీతిలో వినియోగించుకోనున్నారు. రెండు షిప్టులుగా కండక్టర్లు - డ్రైవర్లను ఉపయోగించనున్నారు. ప్రతి రూట్‌ బస్సులకు వేర్వేరుగా కండక్టర్లు టికెట్‌ ఇస్తారు. ప్యాసింజర్లు ముందు ద్వారం నుంచే బస్సు దిగాల్సి ఉంటుంది.