Begin typing your search above and press return to search.
హైకోర్టు చేతులెత్తేసింది..కేసీఆర్ కు బలమొచ్చేసింది!
By: Tupaki Desk | 18 Nov 2019 3:56 PM GMTతెలంగాణ ఆర్టీసీ సమ్మె సోమవారం కీలక మలుపు తీసుకుంది. నెల రోజులకు పైగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులతో చర్చల ప్రసక్తే లేదని - అసలు వారు చేస్తున్న డిమాండ్లను పరిష్కరించే సమస్యే లేదని కూడా తెలంగాణ సీఎం కేసీఆర్ తేల్చి చెప్పేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ వివాదం హైకోర్టుకు చేరగా... హైకోర్టు కూడా రోజుల తరబడి విచారణ జరిపి చివరకు చేతులెత్తేసింది. సమ్మె విరమణ గానీ, కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలని గానీ... తాము ఆదేశాలు జారీ చేయలేమని సంచలన వ్యాఖ్యలు చేసిన హైకోర్టు... బంతిని లేబర్ కోర్టు పరిధిలోకి తోసివేసింది. హైకోర్టు తీసుకున్న ఈ కీలక మలుపుతో కార్మికుల సమ్మెపై కఠినంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసీఆర్ కు నిజంగానే వెయ్యేనుగుల బలం వచ్చేసిందని చెప్పక తప్పదు.
సోమవారం నాడు జరిగిన విచారణలో భాగంగా హైకోర్టు ధర్మాసనం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కోర్టు విచారణకు హాజరైన అడ్వొకేట్ జనరల్ కార్మికుల సమ్మె చట్ట విరుద్దమని బలంగా వాదనలు వినిపించారు. ఏజీ వినిపించిన వాదనలను సాంతం విన్న హైకోర్టు ధర్మాసనం... అంతకుముందు జరిగిన విచారణలను కూడా పరిగణనలోకి తీసుకుని సమ్మెపై తామెలాంటి ఆదేశాలు జారీ చేయలేదమని తేల్చేసింది. రాష్ట్రంలో అత్యున్నత న్యాయస్థాయి అయినా కూడా తమకూ కొన్ని పరిమితులు ఉంటాయని, వాటిని దాటి ముందుకెళ్లడం సాధ్యం కాదని ధర్మాసనం హైకోర్టు పేర్కొంది. అంతేకాకుండా ఈ వివాదం పరిష్కారానికి లేబర్ కోర్టును ఆశ్రయించాలని - లేబర్ కోర్టు ఈ వివాదాన్ని రెండు వారాల్లోగా పరిష్కరించాలని హైకోర్టు తేల్చేసింది.
హైకోర్టు తీసుకున్న ఈ నిర్ణయంతో నిజంగానే సమ్మెపై కేసీఆర్ విక్టరీ సాధించారన్న వాదనలు వినిపిస్తున్నాయి. సరిగ్గా దసరా పండగ సందర్భంగా సమ్మెకు దిగిన ఆర్టీసీ కార్మికులపై ఆదిలో కొంత వ్యతిరేకత వచ్చినా... కేసీఆర్ మాత్రం తగ్గలేదు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే సమస్యే లేదని, కార్మికులు దిగిరాకుంటే సంస్థలో ప్రైవేట్ ఆపరేటర్లకు మరింత మేర ప్రవేశం కల్పిస్తామని కూడా హెచ్చరించారు. ఎన్ని హెచ్చరికలు చేసిన కార్మికులు దిగిరాకపోవడంతో కేసీఆర్ అన్నంత పనీ చేశారు. ఆర్టీసీలో సగం మేర రూట్లలో ప్రైవేట్ ఆపరేటర్లను అనుమతిస్తున్నట్లుగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంపై హైకోర్టు స్టే విధించింది. అయితే తాజాగా హైకోర్టు వ్యాఖ్యలతో కార్మికులపై విజయం సాధించేసిన కేసీఆర్... ఇప్పుడు ప్రైవేట్ ఆపరేటర్లపై కోర్టు ఎలా స్పందిస్తుందన్న దానిపై దృష్టి సారించారు.