Begin typing your search above and press return to search.
పెళ్లికి బస్సు బుక్ చేసుకుంటే టీఎస్‌ఆర్టీసీ సర్‌ప్రైజ్ గిఫ్ట్.. సజ్జనార్ సరికొత్త ఆలోచన !
By: Tupaki Desk | 12 Nov 2021 1:49 PM GMTప్రజలకి దగ్గర కావడానికి , అలాగే ఆదాయం పెంచుకునేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ సరికొత్త ఆలోచనలతో పరుగులు పెడుతోంది. దసరా పండగ నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులపై అదనపు ఛార్జీల ప్రత్యేక బాదుడును తొలగించడంతో అందరినీ ఆకట్టుకున్న ఆర్టీసీ రోజుకొక కార్యక్రమం తో దూసుకుపోతూ సంస్థ భవితవ్యం పై ఎన్నో ఆశలు కలిగిస్తోంది. సీనియర్ ఐపీఎస్ అధికారి సజ్జనార్ ఎండీగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఆర్టీసీలో మార్పు కచ్చితంగా కనిపిస్తోంది.
అటు ప్రయాణీకులు, ఇటు సిబ్బందికి మేలు చేకూరేలా ఆయన ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ ఆర్టీసీ మరో అదిరిపోయే నిర్ణయం తీసుకుంది. వివాహాది శుభ కార్యక్రమాలకు ఆర్టీసీ బస్సులను అద్దెకు తీసుకుంటే వధూవరులకు ఫొటో ఫ్రేమ్‌ను కానుకగా అందజేస్తోంది. గురువారం ఆకుల భరత్‌కుమార్, సౌమ్యల వివాహం గురువారం కొంపల్లిలో జరిగింది. ఈ పెళ్లి కోసం వారి కుటుంబసభ్యులు యాదగిరిగుట్ట డిపోకు చెందిన రెండు బస్సులను అద్దెకు తీసుకున్నారు. దీంతో ఆ బస్సుల డ్రైవర్లు ఆంజనేయులు, గణేష్‌లతో పాటు టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు.
నూతన దంపతులకు సజ్జనార్, ఆర్టీసీ సిబ్బంది కలిసి ఫోటోఫ్రేమ్‌ను బహుమతిని అందజేశారు. ఈ కార్యక్రమాన్ని గురువారం నుంచే మొదలు పెట్టామని, మొదటిరోజే రాష్ట్రవ్యాప్తంగా 475 జంటలకు కానుకలను అందజేసినట్లు ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్ ఓ ప్రకటనలో తెలిపారు. ఇకపై నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్న పత్రంతో పాటు కానుకని డ్రైవరే అందజేయాలని సూచించారు. వివాహాది శుభకార్యాల కోసం ప్రజలు 15 రోజులుగా రెండు వేల బస్సులను బుక్ చేసుకున్నారని సజ్జనార్ తెలిపారు. ఆర్టీసీ ప్రవేశపెట్టిన ఈ వినూత్న కార్యక్రమంలో సంస్థపై ప్రజల్లో మరింత నమ్మకం కలుగుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పెళ్లిళ్లు, శుభకార్యాలకు ఆర్టీసీ బస్సులను అద్దెకు తీసుకొని సంస్థను లాభాల బాటలో నడిపించేందుకు ప్రజలు సహాకరించాలని ఉద్యోగులు కోరారు.