Begin typing your search above and press return to search.
వైవీ సుబ్బారెడ్డిని కలిసి టీటీడీ అర్చకులు
By: Tupaki Desk | 7 Jun 2019 5:19 PM GMTతిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డి పేరు తెరమీదకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, దాదాపు ఇదే ఫైనల్ అవనుందని అధికారిక వర్గాల నుంచి విశ్వసనీయ సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో శుక్రవారం తిరుమల శ్రీవారి అర్చకులు కాబోయే ఛైర్మన్ అని ప్రచారం జరుగుతున్న సుబ్బారెడ్డిని కలిశారు. ఆయనకు శాలువ కప్పి ఆశీర్వచనాలు ఇచ్చారు. ఈ సందర్భంగా కలియుగం దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారి చిత్రపటాలను అందజేసి అక్షింతలు చల్లి ఆశీర్వదించారు. స్వామివారి తీర్థ - ప్రసాదాలను అందజేశారు.
సుబ్బారెడ్డిని కలిసిన వారిలో తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు అర్చకం వేణుగోపాల దీక్షితులు - అర్చకం గోవిందరాజు దీక్షితులు ఉన్నారు. వారు శుక్రవారం మధ్యాహ్నం తాడేపల్లికి చేరుకున్నారు. వైవీ సుబ్బారెడ్డిని ఆయన తాడేపల్లి నివాసంలో కలిశారు.
వైఎస్ కుటుంబం క్రిస్టియానిటీని ఫాలో అవుతుండటంతో చాలామంది వైవీ సుబ్బారెడ్డి కూడా క్రిస్టియన్ అనుకున్నారు. కానీ అతను వైఎస్ కు తోడల్లుడు మాత్రమే. వారు మతం మారలేదు. అనేకసార్లు అయ్యప్ప మాల ధరించి మీడియాలో కూడా కనిపించారు. అయినా కూడా వైఎస్ కుటుంబం మతం వల్ల వైవీ సుబ్బారెడ్డి మతంపై ప్రస్తుతం రచ్చ నడుస్తోంది. క్రైస్తవ మతాన్ని స్వీకరించిన వైవీ సుబ్బారెడ్డికి టీటీడీ ఛైర్మన్ అంటూ సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం జరిగింది. దీనిపై ఈరోజు వైవీ సుబ్బారెడ్డి వివరణ కూడా ఇచ్చారు.
ఇదిలా ఉండగా... వైవీ సుబ్బారెడ్డిని నియమిస్తూ ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. కేబినెట్ హడావుడి కొనసాగుతున్న నేపథ్యంలో రేపటి మీటింగ్ లో కొత్త బోర్డును ప్రకటించే అవకాశం ఉంది. ఆ సమాచారం లేనిదే టీటీడీ అర్చకులు ఆయన్ను కలిసి ఉండరు.