Begin typing your search above and press return to search.
ఆర్డినెన్స్ వస్తేనే... పుట్టా రాజీనామా చేస్తారట
By: Tupaki Desk | 6 Jun 2019 2:01 PM GMTటీడీపీ నేత, మైదుకూరు అసెంబ్లీ నుంచి టీడీపీ అభ్యర్థిగా వరుసగా రెండో సారి కూడా ఓటమిపాలైన పుట్టా సుధాకర్ యాదవ్ నిజంగానే మంకుపట్టు పట్టారన్న వాదన వినిపిస్తోంది. పార్టీలో సీనియర్ మోస్ట్ నేతగా కొనసాగుతున్న మాజీ మంత్రి యనమల వియ్యంకుడిగా ఉన్న పుట్టా గడచిన ఎన్నికల్లో మైదుకూరు అసెంబ్లీ నుంచి పోటీ చేసి వైసీపీ చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత తన వియ్యంకుడిని పట్టుకుని తిరుమల తిరుపతి దేవస్ధానం (టీటీడీ) పాలక మండలి చైర్మన్ పదవిని దక్కించుకున్నారు. ఆ పదవిలో ఉంటూనే తాజా ఎన్నికల్లోనూ మైదుకూరు నుంచి పోటీ చేసి మరోమారు వైసీపీ చేతిలో చిత్తుగా ఓడారు. అంతేకాకుండా ఈ ఎన్నికల్లో వైసీపీ బంపర్ మెజారిటీతో అధికారంలోకి రాగా... పుట్టా సుధాకర్ యాదవ్ టీటీడీ చైర్మన్ పదవిని వీడేందుకు మాత్రం ససేమిరా అంటున్నారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎంగా పదవీ ప్రమాణం చేసే ముందు కూడా టీడీపీ పాలక మండలి సమావేశం పెడతానంటూ బయలుదేరిన పుట్టాకు అధికారుల నుంచి షాక్ తగిలింది. అయినా కూడా తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదని వాదిస్తున్న పుట్టా... ఇప్పుడు ఓ కొత్త వాదనను వినిపిస్తున్నారు. టీడీపీ చైర్మన్ పదవిని తాను టీడీపీ పార్టీ నుంచి పొందలేదని, రాష్ట్ర ప్రభుత్వం ద్వారానే తాను ఈ పదవిలో కూర్చున్నానని ఆయన చెబుతున్నారు. అలాంంటప్పుడు ప్రభుత్వం మారితే తనకు తానుగా రాజీనామా ఎందుకు చేయాలని కూడా ఆయన లాజిక్ తీస్తున్నారు. గతంలో జరిగిన మాదిరిగానే ప్రభుత్వం మారితే నామినేటెడ్ పోస్టుల్లోని నేతలంతా రాజీనామా చేస్తారు కదా, గతంలో టీటీడీ చైర్మన్లు కూడా ఇలాగే చేశారు కదా అన్న ప్రశ్నకు పుట్టా తనదైన శైలి సమాదానాలు చెప్పారు.
తాను ప్రభుత్వం చేత శ్రీవేంకటేశ్వరుడి సేవకు నియమితులయ్యాయనని, తన పదవీ కాలం ముగియకుండా తనకు తానుగా రాజీనామా చేయనని, అది తన సెంటిమెంట్ అని ఆయన చెప్పుకొచ్చారు. అయితే మారిన ప్రభుత్వం పాలక మండలిని రద్దు చేస్తూ ఆర్డినెన్స్ తెస్తే మాత్రం పదవి నుంచి తప్పుకుంటానని చెబుతున్నారు. ఓ టీవీ ఛానెల్ తో మాట్లాడిన సందర్బంగా ఈ కొత్త లాజిక్ ను వినిపించిన పుట్టా... ఆర్డినెన్స్ తెచ్చి తరిమేస్తే తప్పించి టీడీపీ చైర్మన్ పదవిని వీడేది లేదని తేల్చేశారు. అంటే ఇప్పుడు పుట్టా తప్పుకోవాలంటే... ఆర్డినెన్స్ రావాల్సిందేనన్న మాట.