Begin typing your search above and press return to search.

క్రిస్మస్ వేడుకల్లో టీటీడీ ఛైర్మన్‌ ... క్లారిటీ ఇచ్చిన సుబ్బా రెడ్డి !

By:  Tupaki Desk   |   21 Dec 2019 6:01 AM GMT
క్రిస్మస్ వేడుకల్లో టీటీడీ ఛైర్మన్‌ ... క్లారిటీ ఇచ్చిన సుబ్బా రెడ్డి !
X
ఈ నెల 25ను క్రిస్మస్ వేడుకల కి ఇరు తెలుగు రాష్ట్రాలు సిద్దమవుతున్నాయి. అయితే ఏపీ లో క్రిస్మిస్ పండుగ ముందస్తు వేడుకలు రాజకీయం గా కాకరేపుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరం లో డిసెంబర్ 21న జరగబోయే క్రిస్మస్ ఈవెంట్‌ కు ఆత్మీయ విశిష్ట అతిథిగా టీడీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి హాజరు కాబోతున్నారంటూ ఉన్న ఓ ఇన్విటేషన్ కార్డ్ వైరల్ అయిన సంగతి తెలిసిందే. వైసీపీ ఉభయగోదావరి జిల్లాల సమన్వయ కర్త, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అని ఆ పత్రిక లో పొందుపరచడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఆ ఇన్విటేషన్ కార్డు పైభాగం లో మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి తో పాటు ఆయన తనయుడు ప్రస్తుత ఏపీ సీఎం జగన్ ఫోటోలను కూడా పొందుపరిచారు. ఆ ఇన్విటేషన్ కార్డు లో ప్రసంగీకులుగా రెవరెండ్ జక్కల లాల్ బహదూర్ శాస్త్రి పేరును కూడా ప్రచురించారు. ఈ ఆహ్వాన కమిటీ లో 21 మంది పేర్లు ప్రచురించారు. అందులో పేర్లన్నిటికీ చివర ‘వైసీపీ నాయకులు’ అని ఉంది.

దీనిపై నెటిజన్స్ తీవ్రం గా ఫైర్ అయ్యారు. టీటీడీ ఛైర్మన్‌ గా ఉండి క్రిస్మస్ వేడుకలకు ఎలా వెళతారని ప్రశ్నించారు. ఈ వార్తలపై స్పందించిన అయన తనపై దుష్ప్రచారం జరుగుతోందని మండిపడ్డారు. క్రిస్మస్ వేడుకలు నిర్వహిస్తున్నవారికి తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. క్రిస్మస్ వేడుకలకు సంబంధించి తనను ఎవరూ ఆహ్వానించ లేదని , ఇది ఎవరో కావాలని తనను అప్రదిష్టపాలు చేసేందుకు ఇలాంటి చౌకబారు చేష్టలకు పాల్పడుతున్నట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీని పై పోలీసుల కు ఫిర్యాదు చేస్తామని ఆయన వెల్లడించారు. మొదట్లో టీటీడీ ఛైర్మెన్ పై ఫైర్ అయిన నెటిజన్స్ ..అయన దాని పై వివరణ ఇవ్వడం తో శాంతించారు.