Begin typing your search above and press return to search.
చెడ్డపేరు తేవటానికే ‘సంప్రదాయ భోజనం’పై దుష్ర్పచారం
By: Tupaki Desk | 29 Aug 2021 8:19 AM GMTరోటీన్ కు భిన్నంగా వినూత్నంగా నిర్ణయాలు తీసుకోవటం మామూలు విషయం కాదు. ఇలాంటి వాటిని ప్రోత్సహించే విషయంలో ఏపీ ప్రభుత్వం ముందు ఉంటుందన్న విషయాన్ని అర్థమయ్యేలా చేయటానికి టీటీడీ తీసుకొస్తున్న వినూత్న కార్యక్రమాల్ని చెప్పొచ్చు. తిరుమల కొండ మీదకు వచ్చే భక్తుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం తాజాగా 'సంప్రదాయ భోజనం' అన్న కాన్సెప్టును తెర మీదకు తీసుకొచ్చింది.
ఇందులో గో ఆధారిత పంటలతో వండిన ఆహారాన్ని ఇక్కడ సర్వ్ చేస్తారు. కాకుంటే.. ఇందుకు ఎంత ఖరీదు పడితే అంత ఖరీదును మాత్రమే వసూలు చేస్తారు. లాభాపేక్ష లేకుండా నిర్వహించే ఈ కార్యక్రమంపై కొందరు పని కట్టుకొని మరి కొందరు డ్యామేజ్ చేసేలా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని టీటీడీ మండిపడుతోంది. తాజాగా తెర మీదకు వచ్చిన సంప్రదాయ భోజనం పేరుతో.. రానున్న రోజుల్లో ఉచిత భోజనానికి మంగళం పాడేస్తారన్న తప్పుడు ప్రచారం సాగుతోంది.
దీనిపై తాజాగా స్పందించిన టీటీడీ.. భక్తుల్ని గందరగోళ పర్చటానికే ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడింది. నిత్యం వేలాది మంది భక్తులకు స్వామి వారి నిత్యాన్నదానాన్ని అందిస్తున్నామని పేర్కొంది. అయితే.. కొత్తగా ఉంటుందన్న ఉద్దేశంతో సంప్రదాయ భోజనం కాన్సెప్టును ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. దీని తయారీకి ఎంత ఖర్చు అవుతుందో అంతే భక్తుల నుంచి తీసుకుంటామే తప్పించి.. అందుకు భిన్నంగా లాభాలు దండుకోవటం కోసం ఈ ప్రోగ్రాంను ఏర్పాటు చేసినట్లుగా పలువురు ప్రచారం చేస్తున్నా.. అదంతా తప్పని టీటీడీ మరోసారి స్పష్టం చేసింది. భక్తులు ఇలాంటి ప్రచారాన్ని అస్సలు పట్టించుకోవద్దని విన్నవించుకుంది. డబ్బుల కాన్సెప్టును తీసుకొచ్చి.. అనవసరంగా బద్నాం కావటం ఎందుకు? అని ప్రశ్నిస్తున్న వారు లేకపోలేదు. మరేం చేస్తారో? మరెలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.