Begin typing your search above and press return to search.
చరిత్రలో దిద్దుకోలేని తప్పు చేస్తున్న టీటీడీ!
By: Tupaki Desk | 15 July 2018 4:59 AM GMTనిత్యం వేలాది మంది దర్శనం చేసుకోవటం.. శ్రీవారి దర్శనం కోసం గంటల కొద్ది సమయాన్ని వెచ్చించటం.. సెకన్లు మాత్రమే దర్శనమయ్యే స్వామి వారి దర్శనం కోసం తీవ్ర వ్యయప్రయాసలు ఎదుర్కొని మరీ తిరుమలకు వచ్చే భక్తుల మనోభావాల్ని దెబ్బ తీసేలా టీటీడీ వ్యవహరిస్తుందన్న ఆగ్రహం పలువురి నోట వినిపిస్తోంది.
తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో ఇప్పటివరకూ ఎప్పుడూ లేని రీతిలో స్వామి వారి దర్శనాన్ని ఆరు రోజుల పాటు నిలిపివేయటంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతకాలం సూర్య.. చంద్ర గ్రహణాల వేళల్లో కొన్ని గంటల పాటు.. లేదంటే ఒక పూట స్వామి వారి దర్శనాన్ని నిలిపివేసే వారు.
కానీ.. పన్నెండేళ్లకు ఒకసారి జరిపే మహా సంప్రోక్షణ సందర్భంగా స్వామి వారి దర్శనాన్ని ఆరు రోజుల పాటు నిలిపివేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకోవటం షాకింగ్ గా మారింది. పన్నెండేళ్లకు ఒకసారి ఈ తరహా కార్యక్రమం జరిపినప్పుడు.. గతంలో అనుసరించిన విధానం ఏమిటన్నది చూస్తే.. తాజా పాలకమండలి దిద్దుకోలేని తప్పు చేసిన వైనం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుందని చెప్పక తప్పదు.
1958 నుంచి ఇప్పటివరకూ ఐదుసార్లు మహాసంప్రోక్షణ జరిపారు. అయినప్పటికీ.. ఆ సమయాల్లో భక్తులకు దర్శనాన్ని నిలిపివేయలేదు. దీనికి కారణం.. అప్పట్లో భక్తుల రద్దీ తక్కువన్న మాటను చెబుతున్నారు. ప్రస్తుతం భక్తులు రద్దీ ఎక్కువగా ఉండటం.. నిత్యం 60వేలకుపైనే స్వామి వారిని దర్శించుకోవటం చేస్తున్నారు. వైదిక కార్యక్రమాలకు అంతరాయం లేకుండా ఉండటానికే భక్తులకు పూర్తిగా దర్శనం నిలిపివేస్తున్నట్లుగా చెబుతున్నారు.
ఆగస్టు 11న అంకురార్పణతో మహా సంప్రోక్షణ క్రతువు స్టార్ట్ కానుంది. ఇందులో భాగంగా గర్భాలయంతో పాటు విమాన ప్రాకారం.. ఆనందనిలయం పైభాగంలో ఇతర దేవతా మందిరాల్లో మరమ్మతులు చేపడతారు. ప్రతి రోజూ మూడు పూటలా స్వామి వారికి నివేదన.. ఇతర కైంకర్యాల్ని నిర్వహిస్తారు. ఇదంతా చేయటానికి సమయం పడుతుంది కాబట్టి దర్శనాల్ని పూర్తిగా నిలిపివేసినట్లుగా చెబుతున్నారు. అయితే.. ఈ నిర్ణయం ఏ మాత్రం సరికాదన్న వాదన వినిపిస్తోంది.
మహా సంప్రోక్షణ కార్యక్రమంలో భాగంగా చేపట్టాల్సిన క్రతువులకు సమయం తీసుకుంటుందంటే.. భక్తులకు నామమాత్రంగా అయినా దర్శనం కల్పించాల్సిన అవసరం ఉంది. వీవీఐపీలకు కల్పించే బ్రేక్ దర్శనాలతో పాటు.. నిత్యం నిర్వహించే సేవల్ని నిలిపివేయొచ్చు. రూ.300 క్యూ దర్శనాలు లాంటివి ఆపేయొచ్చు. జరుగుతున్న కార్యక్రమం గురించి వివరంగా ప్రచారం చేసి.. కేవలం పరిమిత సంఖ్యలో మాత్రమే భక్తులకు దర్శనం కల్పించే వీలుందని చెప్పి.. తిరుమల ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని కోరే వీలుంది.
స్వామి వారిని తప్పనిసరిగా దర్శనం చేసుకోవాలన్న ఆలోచన ఉన్న వారికి కష్టం కలగకుండా ఉండేలా టీటీడీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఉదాహరణకు అన్ని రకాల దర్శనాల్ని బంద్ చేస్తున్నామని.. కేవలం కొండ మార్గంలో నడిచి వచ్చే భక్తులు.. అది కూడా పరిమిత సంఖ్యలో మాత్రమే దర్శనాలకు అనుమతిస్తామన్న ప్రకటన చేయొచ్చు. ఆచరణలో ఇదేమీ అసాధ్యమైన పని కాదు. కానీ.. ఆ దిశగా టీటీడీ అధికారులు.. బోర్డు సభ్యులు ఆలోచన చేసినట్లుగా కనిపించదు. భక్తుల మనోభావాలు తమకు ఏ మాత్రం పట్టవని.. తాము పట్టిన కుందేటికి మూడే కాళ్లు అన్నట్లుగా టీటీడీ వ్యవహరించటం ఏమిటన్నది ప్రశ్నగా మారింది.
ఓపక్క ఆలయంలో ఏదేదో జరిగిందంటూ రమణ దీక్షితులు ఆరోపణలు చేస్తున్న వేళలోనే.. ఆరు రోజుల పాటు స్వామి వారి దర్శనాన్ని భక్తులకు పూర్తిగా నిలిపివేసి మరీ మహా సంప్రోక్షణ చేయాలన్న నిర్ణయం తీసుకోవటం సంచలనంగా మారటమే కాదు.. లేనిపోని అనుమానాలకు తెర తీస్తుందని చెప్పక తప్పదు.