Begin typing your search above and press return to search.

టీటీడీ ఈవో ధర్మారెడ్డికి నెలరోజుల జైలు శిక్ష.. జరిమానా

By:  Tupaki Desk   |   13 Dec 2022 2:36 PM GMT
టీటీడీ ఈవో ధర్మారెడ్డికి నెలరోజుల జైలు శిక్ష.. జరిమానా
X
ఏపీలో ఉల్లంఘనల మీద ఉల్లంఘనలు జరుగుతూనే ఉన్నాయి. హైకోర్టుల్లో జగన్ సర్కార్ కు ఎదురుదెబ్బలు కొత్త కాదు. ప్రతీసారి హైకోర్టులు ఆదేశించడం.. జగన్ ప్రభుత్వంలోని అధికారులు వాటిని పాటించకపోవడం.. వారికి జైలు శిక్ష విధించడం జరుగుతూనే ఉంది. ఇప్పుడు అధికారులే కాదు.. టీటీడీకి కూడా ఆ సంస్కృతి పాకింది. టీటీడీ ఈవో కూడా హైకోర్టు ఆదేశాలను పెడచెవినపెట్టాడు. ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నాడు.

తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఈవో ధర్మారెడ్డికి ఏపీ హైకోర్టు జైలుశిక్ష, జరిమానా విధిస్తూ గట్టి షాకిచ్చింది. తాత్కాలిక ఉద్యోగుల సర్వీస్ క్రమబద్ధీకరణ వ్యవహారంలో కోర్టు ఆదేశాలు అమలు చేయలేదని ఉద్యోగులు కోర్టు ధిక్కరణ పిటీషన్ దాఖలు చేశారు.

పిటీషన్ పై విచారణ చేపట్టిన ధర్మాసనం.. ఉద్యోగుల విషయంలో కోర్టు ఆదేశాలను అమలు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు ధర్మారెడ్డికి నెలరోజుల జైలు శిక్ష, రూ.2వేల జరిమానా విధిస్తూ హైకోర్టు మంగళవారం సంచలన తీర్పునిచ్చింది.

టీటీడీలో ప్రోగ్రామ్ అసిస్టెంట్స్ గా పనిచేస్తున్న కొమ్ము బాబు ఇతరుల సర్వీస్ ను రెగ్యులరైజ్ చేయాలని 2022 ఏప్రిల్ 13వ తేదీన ఇదే కోర్టు తీర్పునిచ్చింది. అయితే ఈ తీర్పును టీటీడీ అమలు చేయలేదు. దీంతో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి, గోవిందరాజులపై కోర్టు ధిక్కార నేరం కింద పిటీషన్ దాఖలైంది. దీనికి బాధ్యుడిగా ఈవో ధర్మారెడ్డికి కోర్టు జైలు శిక్ష విధించింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.