Begin typing your search above and press return to search.

టీడీపీ బండారం బయటపెట్టిన రమణ దీక్షితులు..

By:  Tupaki Desk   |   19 May 2018 6:14 AM GMT
టీడీపీ బండారం బయటపెట్టిన రమణ దీక్షితులు..
X
గత వారం బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా తిరుమల వెంకన్న దర్శనానికి వచ్చినప్పుడు తిరుమల ప్రధానాచార్యులు ఏవీ రమణచారి ఆయనకు అపూర్వ రీతిలో స్వాగత సత్కరాలు పలకడం కొందరు టీడీపీ నాయకులకు కంటగింపుగా మారింది.. అమిత్ షా కర్ణాటక ఎన్నికల ప్రచారం ముగించుకొని గెలుపుకోసం శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమిత్ షాకు సంప్రదాయ బద్దంగా స్వాగతం పలికారు రమణ దీక్షితులు.. దీనిపై టీడీపీ నేతల నుంచి విమర్శలు రావడంతో రమణ దీక్షితులు తాజాగా స్పందించారు..

‘ఏ ముఖ్య అతిథులు - దాతలు తిరుమలకు వచ్చినా సంప్రదాయాల ప్రకారం నా డ్యూటీ నేను చేస్తాను.. అమిత్ షాను కూడా అలాగే రిసీవ్ చేసుకున్నారు. ఇలా చేసుకోవడం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి నచ్చలేదని తెలిసిందంటూ’ రమణ దీక్షితులు వాపోయారు.. తాను గతంలో చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు కూడా ఇలానే రిసీవ్ చేసుకున్నానని.. తాను చంద్రబాబు ఎస్వీ యూనివర్సిటీలో కలిసి చదువుకున్నప్పటి నుంచి తాను ఇలానే మారకుండా ఉంటున్నానని, ఆ విషయం చంద్రబాబుకు తెలుసు అని అన్నారు.

తాను ఎస్వీ యూనివర్సిటీలో మాలిక్యూలార్ బయోలజీలో పీహెచ్.డీ చేశానని.. తాను చదివిన చదువులకు విదేశాల్లో లక్షల జీతాలు, ఆఫర్లు వచ్చినా దేవుడి సేవ కోసం అవన్నీ వదులుకున్నానని.. తనపై ఆరోపణలు చేయడం టీడీపీ నేతలకు తగదన్నారు. చంద్రబాబు గుడికి వచ్చినా ఆయనతో తాను చాలా సేపు గడుపుతానని.. ఆయనకు రంగనాయకుల మండపంలోనే ఆశ్వీరచనాలు అందిస్తానని ’దీక్షతులు తెలిపారు.

తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి తనను పంపేంచేలా ప్రయత్నాలు జరుగుతున్నాయని.. నా రిటైర్మెంట్ కోసం కొందరు ఎదురుచూస్తున్నారని ఆయన విమర్శించారు. ‘‘ఆరు నెలల నుంచి నన్ను తిరుమల నుంచి తప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు.. కానీ ఆ దేవుడికి సేవ చేసే హక్కు తనకు ఉంది. దీన్ని ఎవ్వరూ ఆపలేరు’ అంటూ రమణ దీక్షితులు ఒకింత హెచ్చరికతో కూడిన స్వరంతో మాట్లాడారు. ఇలా రమణ దీక్షితుల విషయంలో టీడీపీ ఆడుతున్న నాటకాలను ఆయన బయటపెట్టడం ఇప్పుడు తాజాగా సంచలనమైంది.