Begin typing your search above and press return to search.

టీటీడీ స‌మ‌స్య‌ను బాబు తీర్చ‌లేడా?

By:  Tupaki Desk   |   5 Feb 2017 7:15 AM GMT
టీటీడీ స‌మ‌స్య‌ను బాబు తీర్చ‌లేడా?
X
ఆప‌ద మొక్కుల వాడైన తిరుమ‌లేశుడి స‌న్నిధికే దాదాపు అలాంటి ప‌రిస్థితి వ‌చ్చిప‌డింది. అది కూడా ఆర్థిక‌ప‌ర‌మైన‌ది కావ‌డం ఆస‌క్తిక‌రం. పెద్ద నోట్ల ర‌ద్దుతో సామాన్యులు ఇక్క‌ట్లు ప‌డుతున్న‌ట్లే ఇప్పుడు వెంక‌న్న స‌న్నిధిలోని అధికారులు సైతం అదే త‌ర‌హా ప‌రేషాన్ లో ప‌డ్డారు. ఇంత‌కీ విష‌యం ఏమిటంటే పెద్ద నోట్ల‌ను ర‌ద్దు చేసిన కేంద్ర ప్ర‌భుత్వం వాటిని దేవాల‌యాల్లోని హుండీల్లో వేసుకోవ‌చ్చున‌నే అవ‌కాశం క‌ల్పించిన సంగ‌తి తెలిసిందే. ఈ వెసులుబాటుతో భ‌క్తులు త‌మ ద‌గ్గ‌ర ఉన్న సొమ్మును టీటీడీ హుండీల్లో వేశారు. ఈ నేపథ్యంలో ఈ జనవరి వ‌ర‌కు హుండీ ద్వారా భక్తుల నుంచి వచ్చిన రూ.4 కోట్ల పాతనోట్లు జ‌మ‌య్యాయి. అయితే తాజాగా కేంద్ర ప్ర‌భుత్వం పాతనోట్లు కలిగి ఉండటాన్ని నేరంగా పరిగణించే బిల్లును లోక్‌ సభలో ప్రవేశపెట్టింది. అయితే తిరుమల హుండీకి వచ్చిన పాతనోట్ల మార్పిడిపై టీటీడీ డైలమాలో పడింది.

భక్తులు ఇచ్చిన కానుకలైన పాతనోట్లను మార్చే విధానంపై తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం అధికారులు గంద‌ర‌గోళంలో ప‌డిపోయారు. ఈ విష‌యంలో ఏదైనా స‌ల‌హా ఇవ్వాలంటూ రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను కోరారు. అయితే గతంలో రాసిన లేఖలకే ఆర్బీఐ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. తాజా లేఖ‌కు ఏం రియాక్ష‌న్ ఉంటుందనే సందేహం అప్పుడే మొద‌లైంది. ఈ విష‌యంలో అంద‌రి క‌ళ్లూ ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు పై పడ్డాయి. కేంద్ర ప్ర‌భుత్వంతో త‌న‌కున్న స‌ఖ్య‌త‌తో ఏపీ ముఖ్య‌మంత్రి ఈ నాలుగుకోట్ల న‌గ‌దుకు ప‌రిష్కారం చూపిస్తార‌ని ఆశిస్తున్నారు. కుదిరితే ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి - ఆర్బీఐకి లేఖ రాసి స‌మ‌స్య‌ను నివేధిస్తే ఈ మొత్తాన్ని ఆర్బీఐ స్వీక‌రించి త‌గు విలువ‌ను టీటీడీపీకి అంద‌జేస్తుంద‌ని అనుకుంటున్నారు. ఈ విష‌యంలో బాబు ఏ విధంగా స్పందిస్తారో.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/