Begin typing your search above and press return to search.

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఆలయాలు : టీటీడీ సంచలన నిర్ణయం !

By:  Tupaki Desk   |   28 Aug 2020 5:32 PM GMT
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఆలయాలు : టీటీడీ సంచలన నిర్ణయం !
X
శ్రీవారి వైభవం దశదిశలా చాటుతోంది టీటీడీ. హిందూ దర్మ ప్రచారం కోసం టీటీడీలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి ఏటా కొన్ని కోట్లు వరకు వెచ్చిస్తోంది. ఇందులో భాగంగా పురాతన ఆలయాలు పున:రుద్దరణ, పలురాష్ట్రాల్లో ఆలయాల నిర్మాణానికి ఆర్థిక సహయం చేయడం, దేశవ్యాప్తంగా శ్రీవారి కళ్యాణ నిర్వహణ, కళ్యాణ రథాల ద్వారా స్వామివారి వైభవాన్ని చాటి చెప్పడంతోపాటు, వైభవోత్సవాల పేరుతో పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది టీటీడీ. మరోవైపు ప్రాశస్త్యం కలిగిన ఆలయాలను తమ పరిధిలోకి తీసుకుంటోంది టిటిడి. ధర్మ ప్రచారంలో భాగంగా కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు శ్రీవారి ఆలయాలు నిర్మిస్తామని టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి తెలిపారు. త్వరలోనే ముంబైలో ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేయబోతున్నామని, ఆలయ నిర్మాణానికి భక్తుల నుండి విరాళాలు సేకరిస్తామని అని చెప్పారు. కరోనా కారణంగా వచ్చే నెల 19న జరగబోయే సాలకట్ల బ్రహ్మోత్సవాలను భక్తులు లేకుండానే నిర్వహిస్తామని ఆయన చెప్పారు.

తాజాగా టీటీడీ పాలకమండలి భేటీ జరగగా ... కొద్దీసేపటికి ముగిసింది. ఈ సమావేశంలో టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. కరోనా వచ్చిన ఉద్యోగుల వైద్య ఖర్చులు టీటీడీనే భరిస్తుందని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. కరోనా కారణంగా వడ్డీ ద్వారా వచ్చే ఆదాయం తగ్గుముఖం పట్టిందని తెలిపారు. రూ.5.5 కోట్లతో బర్డ్ ఆస్పత్రిలో 50 గదుల నిర్మాణిస్తున్నామని తెలిపారు. బర్డ్ ఆస్పత్రి ప్రాంగణంలో చిన్నపిల్లలు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, విశాఖలో రూ.4.95 కోట్లతో శ్రీవారి ఆలయం వద్ద ఘాట్‌ రోడ్డు నిర్మిస్తామని తెలిపారు. టీటీడీ ఉద్యోగులను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తేవాలని కోరుతామన్నారు. ఉదయాస్తమాన సేవ టికెట్లు ఉన్న భక్తులకు బ్రేక్‌ దర్శనాలు కల్పిస్తామని సుబ్బారెడ్డి తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లోని గిరిజన, మత్స్యకార వాడల్లో 500 ఆలయాలు నిర్మిస్తామని సుబ్బారెడ్డి ప్రకటించారు. సాలకట్ల బ్రహ్మోత్సవాలను ఏకాంతంగానే నిర్వహిస్తామని, అక్టోబర్ 16 నుంచి జరగాల్సిన నవరాత్రి బ్రహ్మోత్సవాలపై అప్పటి పరిస్థితులను భట్టి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.