Begin typing your search above and press return to search.
మనమడి కోసం రమణ దీక్షితులు అంత చేసారు?
By: Tupaki Desk | 2 Nov 2016 6:14 AM GMTకొడుకు కొడుకు మీద రమణ దీక్షితుల ప్రేమ.. ఆయన కొంప ముంచటమే కాదు... ఆయన పేరెత్తితే చాలు శ్రీవారి భక్తులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఆచారాల్ని.. నిబంధల్ని నీళ్లకు వదిలేసి.. అంత ఇష్టారాజ్యంగా వ్యవహరించటం ఏమిటంటూ పలువురు మండిపడుతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలోని గర్భాలయంలోకి పరిమిత సంఖ్యలోనే ఎంట్రీ ఉంటుంది. ప్రధాన అర్చకులతో పాటు.. ఎంపిక చేసిన కొందరు అర్చకులు.. సేవక్ ల పేరిట కొందరికి మాత్రమే స్వామి వారిని అత్యంత దగ్గరగా సేవ చేసే అవకాశం దక్కుతుంది.
అయితే.. ఇలాంటి వాటిని పట్టించుకోని తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రధాన ఆర్చకులు రమణదీక్షితులు తాజాగా చేసిన పని ఆయనకు చెడ్డపేరు తీసుకురావటమే కాదు..సంజాయితీ నోటీసులు జారీ అయ్యేలా చేసింది. ఆగమశాస్త్రానికి విరుద్ధంగా వ్యవహరించిన ఆయన.. తన కొడుకు కొడుకు (ఈ కొడుకు కూడా ఆర్చకులే) అయిన మనమడ్ని ఎవరి అనుమతి తీసుకోకుండానే.. స్వామి వారి గర్భాలయంలోకి తీసుకెళ్లారు.
దీనిపై వచ్చిన ఫిర్యాదుల్ని పరిగణలోకి తీసుకున్న అధికారులు.. సీసీ కెమేరా ఫుటేజ్ ని పరిశీలించి.. రమణ దీక్షుతులపై వచ్చిన ఆరోపణలు నిజమని తేల్చారు. చేసిన పనికి వివరణ ఇవ్వాలని టీటీడీ కోరింది. ఈ మధ్యన జరిగిన స్వామి వారి బ్రహ్మోత్సవాల సమయంలో గత నెల 8న హనుమంత వాహన సేవ జరిగింది. ఈ సమయంలో స్వామివారి నైవేద్య విరామ సమయంలో మనమడ్ని వెంటబెట్టుకొని గర్భాలయంలోకి తీసుకెళ్లటం వివాదంగా మారింది. అప్పట్లో బయటకు పొక్కని ఈ వ్యవహారం.. తాజాగా జారీ చేసిన సంజాయిషీ నోటీసుతో బయటకు వచ్చింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/