Begin typing your search above and press return to search.

శ్రీవారి ఆస్తులు అమ్మడం మంచిది కాదు : రాకేష్ సిన్హా!

By:  Tupaki Desk   |   25 May 2020 10:10 AM GMT
శ్రీవారి ఆస్తులు అమ్మడం మంచిది కాదు : రాకేష్ సిన్హా!
X
తిరుమల తిరుపతి దేవస్థానం భూముల అమ్మకం వ్యవహారం ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ సెగలు పుట్టిస్తుంది. ప్రస్తుతం శ్రీవారి భూముల అమ్మకం పై రాష్ట్రంతో పాటుగా దేశం మొత్తం చర్య నడుస్తుంది. ప్రతిపక్ష పార్టీలు ఆ శ్రీవారి భూముల అమ్మకాన్ని తప్పుబడితే.. ఇప్పుడు టీటీడీ పాలకమండలి సభ్యుల్లోనూ భిన్నాభిప్రాయాలు మొదలయ్యాయి. తాజాగా టీటీడీ బోర్డ్ ప్రత్యేక ఆహ్వానితుడు, ఎంపీ రాకేష్ సిన్హా ఈ నిర్ణయాన్నితప్పుబట్టారు.

ఈ మేరకు టీటీడీ పాలకమండలి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి లేఖ రాశారు. టీటీడీ ఆస్తుల అమ్మకం నిలిపివేయాలని రాకేష్ సిన్హా కోరారు. శ్రీవారికి భక్తులు విరాళంగా ఆస్తులు ఇచ్చారని గుర్తు చేస్తూనే.. భక్తుల మనోభావాలకు ముడిపడిన అంశం కాబట్టి.. దీనిపై పునఃసమీక్ష చేయాలని కోరారు. టీటీడీ ఆస్తుల్ని కాపాడుకోవడం పెద్ద సమస్య ఏమీ కాదని, అవసరమైతే భక్తుల్ని కూడా భాగస్వామ్యం చేయొచ్చన్నారు. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అని చెప్పి, ఇప్పుడు ఆస్తుల అమ్మకానికి పెట్టడం సరికాదని, ఇది గత ప్రక్అభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయం అయితే మీరు రద్దు చేయాలనీ , శ్రీవారి ఆస్తులని పరిరక్షించాలి అని అయన కోరారు.

కాగా. శ్రీవారి స్థిరాస్తులను అమ్మాలని టీటీడీ పాలకమండలి నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. తమిళనాడులో ఉన్న 28 ఆస్తులు విక్రయించాలనిరెండు స్పెషల్ టీమ్‌లను ఏర్పాటు చేసింది. ఈ ఆస్తుల బహిరంగ వేలానికి సంబంధించి విధివిధానాలు ఖరారు చేయాలని ఆదేశించింది. భూములు అమ్మకానికి పెట్టడంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి . చూడాలి మరి టీటీడీ దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో ..