Begin typing your search above and press return to search.
తిరుమలలో షరతులు వర్తిస్తాయి..వాళ్లకి మాత్రమే!
By: Tupaki Desk | 16 March 2020 11:11 AM GMTదేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతుండటంతో జనం గుమిగూడే అన్ని ప్రాంతాలు - కార్యక్రమాలపై ప్రభుత్వాలు ఆంక్షలు విధించాయి. క్రీడా ఈవెంట్లు వాయిదా పడ్డాయి. స్కూళ్లు - సినిమా హాళ్లు - షాపింగ్ మాళ్లు మూతపడ్డాయి. మూవీ షూటింగులు - రిలీజ్ లు - సభలు - సమావేశాల డేట్లు మారిపోయాయి. నిత్యం వేలాదిమంది వెళ్లే తిరుమలలోనూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కంపార్టుమెంట్లలో భక్తులు ఎదురుచూడాల్సిన అవసరం లేకుండా నేరుగా స్వామిదర్శనానికి పంపనున్నారు. మంగళవారం నుంచి ఇది అమల్లోకి వస్తుంది. అదేరోజు దివ్యాంగులు - వృద్దులకు ప్రత్యేక దర్శనానికి అనుమతిస్తారు. ఉదయం 10 గంటలు - మధ్యాహ్నం 2గంటలు - 3 గంటలకు వీరికి ప్రత్యేక అనుమతి ఉంటుంది. బుధవారం... ఐదేళ్లలోపున్న పిల్లలు - వారి తల్లీతండ్రులకు ప్రత్యేక దర్శనం కల్పిస్తారు. ఉదయం 9 గంటలకు - మధ్యాహ్నం ఒకటిన్నరకు వాటికి టైమ్ కేటాయించారు.
విదేశాల నుంచి వచ్చేవారి నుంచే వైరస్ వ్యాపిస్తోంది కాబట్టి, ఇతర దేశాల నుంచి స్వామి దగ్గరకు వచ్చేవారికి టీటీడీ ప్రత్యేక విజ్ఞప్తి చేస్తోంది. విదేశాల నుంచి స్వదేశానికి వచ్చిన తర్వాత - 28 రోజులు ఇంటిదగ్గరే ఉండమని - ఆ తర్వాతే తిరుమలకు రావాలని సూచిస్తోంది. భక్తులకు వైద్య పరీక్షలు చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసింది. ఏడుకొండలు ఎక్కకముందే అలిపిరి - శ్రీవారి మెట్టు - టోల్ గేట్ వద్ద వైద్య పరీక్షలు చేస్తున్నారు. ఇప్పటికే దర్శనం టిక్కెట్లు బుక్ చేసుకున్న భక్తులు అనారోగ్యానికి గురైతే - తిరుమల యాత్రను రద్దు చేసుకోవాలని టీటీడీ చెబుతోంది. వారి టికెట్టును dyeotemple@gmail.comకి మెయిల్ చేస్తే.... దర్శనం డేట్ మార్చుకోవడానికి - లేదా డబ్బు వాపసు పొందడానికి వీలు కల్పిస్తోంది. కరోనా భయంతో.. తిరుమలపై సహస్ర దీపాలంకరణ సేవ - వసంతోత్సవం - విశేష పూజల సేవలను టీటీడీ రద్దు చేసింది.