Begin typing your search above and press return to search.

ఇకపై తిరుమలలో ప్రధాని, సామాన్యుడు ఒకటే

By:  Tupaki Desk   |   17 Feb 2022 5:30 PM GMT
ఇకపై తిరుమలలో ప్రధాని, సామాన్యుడు ఒకటే
X
కరోనా తీవ్రత దృష్ట్యా కొంతకాలంగా తిరుమల వెంకన్నను దర్శించుకునే భాగ్యం దక్కడం లేదని చాలామంది భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నా సంగతి తెలిసిందే.

కోవిడ్ నేపథ్యంలో ఆన్ లైన్ లో మాత్రమే టికెట్లు విడుదల చేస్తున్న టీటీడీ...ఫిబ్రవరి 16 నుంచి ఆఫ్ లైన్ లో కూడా టికెట్లు జారీ చేయడంతో తిరుమల భక్తులతో పోటెత్తుతోంది. ఈ క్రమంలోనే తాజాగా సమావేశమైన టీటీడీ పాలకమండలి భక్తుల సౌకర్యార్థం పలు సంచలన నిర్ణయాలు తీసుకుంది.

ఇకపై ప్రధాని నుంచి సామాన్యుడి వరకు అందరికీ ఒకేరకమైన భోజనం అందించాలని టీటీడీ నిర్ణయించింది. తిరుమలలో ప్రైవేటు హోటళ్లను తొలగించి భక్తులందరికీ శ్రీవారి అన్న ప్రసాదం అందేలా చర్యలు తీసుకుంటామని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు.

కరోనా దెబ్బకు తిరుమలలో కొంతకాలంగా నిలిచిపోయిన ఆర్జిత సేవలను పూర్తి స్థాయిలో పునరుద్ధరించాలని టీటీడీ నిర్ణయించింది.

రికమండేషన్ లెటర్ల లపై ఆర్జిత సేవా టికెట్ల ధరలను భారీగా పెంచాలని నిర్ణయించింది. సుప్రభాత సేవకు రూ.2 వేలు, తోమాల, అర్చన సేవలకు రూ.5వేలు, వేద ఆశీర్వచనానికి రూ.10 వేలు, కళ్యాణోత్సవానికి రూ.2,500, వస్త్రాలంకరణ సేవా టికెట్ ధరను రూ.లక్షకు పెంచాలని ఫిక్స్ అయింది.

ఆనంద నిలయానికి బంగారు తాపడ పనులతో పాటు అన్నమయ్య నడక మార్గాన్ని అభివృద్ధి చేయాలని, అలిపిరి వద్ద ఆధ్యాత్మిక సిటీ నిర్మాణానికి నిర్ణయం తీసుకుంది.

రూ.3,096 కోట్ల అంచనాతో 2022-23 వార్షిక బడ్జెట్‌కు టీటీడీ ఆమోదం తెలపుతూ రూ.230 కోట్ల వ్యయంతో పద్మావతి చిన్నపిల్లల మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం చేపట్టాలని సంకల్పించింది. రూ.2.7 కోట్లతో స్విమ్స్ ఆస్పత్రిని పూర్తి స్థాయిలో అభివృద్ధి, కంప్యూటీకరణ చేయాలని నిర్ణయించింది.టీటీడీ ఉద్యోగులకు నగదు రహిత వైద్య సేవలు అందించేందుకు రూ.25 కోట్లు కేటాయించింది.

నాదనీరాజనం మండపాన్ని శాశ్వత ప్రాతిపాదికన నిర్మించేందుకు, ఆయుర్వేద ఫార్మసీని రూ. 3.6 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేసేందుకు సంకల్పించింది. శ్రీనివాస సేతు ప్రాజెక్టుకు ఇప్పటి వరకు రూ.100 కోట్లు విడుదల చేశామని.. ఈ ఏడాది డిసెంబర్ లోగా మరో రూ.150 కోట్లు విడుదల చేస్తామని టీటీడీ వెల్లడించింది.