Begin typing your search above and press return to search.
టీటీడీ సంచలన నిర్ణయం.. తిరుపతిలో మద్యం పూర్తిగా బంద్?
By: Tupaki Desk | 24 Oct 2019 6:52 AM GMTసంచలన నిర్ణయాన్ని ప్రకటించింది తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి. తిరుమలకు దిగువన ఉన్న తిరుపతి నగరంలో పూర్తిస్థాయిలో మద్యనిషేధానని అమలు చేయాలని నిర్ణయించింది. టీటీడీ బోర్డు ఛైర్మన్ గా వ్యవహరిస్తున్న వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగిన బోర్డు సమావేశంలో ఈ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు.
ఏపీలో దశల వారీగా మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తామని ఎన్నికల ముందు నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెబుతున్నారు. దీనికి తగ్గట్లే.. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం షాపుల్ని ప్రభుత్వమే విక్రయించేలా చేయటమే కాదు.. మద్యం అమ్మకాల్ని తగ్గించేదిశగా పలుప్రయత్నాలు చేస్తోంది ఏపీ సర్కారు.
దీనికి తగ్గట్లే తాజాగా అధ్యాత్మిక నగరమైన తిరుపతిలో సంపూర్ణ మద్యనిషేధాన్ని అమలు చేయటమేకాదు.. తిరుపతికి 10 కిలోమీటర్ల పరిధిలో మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలని భావిస్తోంది.అంతేకాదు తిరుపతిలోని స్విమ్స్ ను టీటీడీ పరిధిలోకి తీసుకురావాలని నిర్ణయించారు.
అదే విధంగా తిరుపతి నగరంలో 200 ఎకరాల స్థలంలో శ్రీవారి భక్తిధామం పేరుతో అధ్యాత్మిక నగరాన్ని నిర్మించాలని.. భక్తుల తాకిడి తగ్గించేలా వసతి సముదాయాల నిర్మాణంతో తిరుమల మీద ఒత్తిడి తగ్గించాలని భావిస్తున్నారు. ప్రధాని మోడీ సూచలనకు తగ్గట్లు.. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నిషేధించటంతో పాటు.. సంక్రాంతి తర్వాత నుంచి ప్లాస్టిక్ బాటిళ్ల వాడకాన్ని సైతం నిషేధించాలని నిర్ణయం తీసుకున్నారు. మొత్తానికి రాష్ట్రం మొత్తంగా మద్యపాన నిషేధానికి ముందు..అధ్యాత్మికనగరమైన తిరుపతిలో సంపూర్ణ మధ్య నిషేధాన్ని అమలు చేయాలన్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.