Begin typing your search above and press return to search.

టీటీడీ సంచలన నిర్ణయం..ఆ అర్చుకులు మళ్లీ విధుల్లోకి.. !

By:  Tupaki Desk   |   3 April 2021 7:32 AM GMT
టీటీడీ సంచలన నిర్ణయం..ఆ అర్చుకులు మళ్లీ విధుల్లోకి.. !
X
కలియుగ ప్రత్యేక్ష దైవంగా పేరు గాంచిన శ్రీనివాసుడుని దర్శనార్ధం కోసం ప్రతి నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు వస్తుంటారు. ఇలా వచ్చిన భక్తుల గోవింద నామస్మరణలతో ఏడు కోండలు మారుమోగుతుంటుంది. నిత్య కళ్యాణం ..పచ్చ తోరణం అనే నానుడికి ప్రాణం పోసినట్టు ప్రతి నిత్యం ఆ స్వామి వారి కళ్యాణం కొండపై కమనీయంగా జరుగుతుంది. ఆ దేవదేవుడిని ఒక్కసారి దర్శించుకున్నా జన్మ ధన్యం అంటూ దేశ , విదేశాల నుండి భక్తులు వస్తుంటారు.

ఇక ఇదిలా ఉంటే..తాజాగా రిటైర్డ్ అర్చకులకు సంబంధించి టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. రిటైర్డ్ అర్చకులను విధుల్లోకి తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో రిటైర్డ్ అయిన ప్రధాన అర్చకులతో పాటుగా మిగతా అర్చకులు కూడా విధుల్లో చేరాలని ఆదేశాలు జారీ చేసింది టీటీడీ. 38118/2018 హైకోర్టు తీర్పు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు టీటీడీ తెలిపింది. టీటీడీ నిర్ణయంతో గతంలో రిటైర్డ్ అయ్యిన రమణ దీక్షితులు తిరిగి ప్రధాన అర్చకుల హోదాలో ఆలయప్రవేశం చేయబోతున్నారు. అయితే ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న ఆలయ ప్రధాన అర్చకులు ఆ పోస్ట్ లోనే కొనసాగుతారా లేదా అన్నది తెలియాల్సి ఉన్నది. టీటీడీ నిర్ణయం పట్ల మాజీ అర్చకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుత శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలవడం, వీరి ప్రతిపాదనలకు సీఎం వద్ద నుంచి సానుకూలంగా స్పందన రావడంతో మరో మారు మిరాశీ అర్చకుల మధ్య వివాదానికి తెరలేచింది. ప్రస్తుతం రిటైర్డ్ అర్చకులు ప్రస్తుత ప్రధాన అర్చకులకు మధ్య వివాదాన్ని రాజేసింది. టీటీడీ తమకు అర్చకత్వం ఇస్తే చాలు అంటూ యువ పండితులు సీఎంను కోరితే...తమ వంశ పార్యంపర్యాన్ని కాపాడాలని సీనియర్ అర్చకులు ప్రతిపాదనలు చేశారు. ఇంత గొడవకు ముఖ్యకారణం అప్పటి టీడీపీ హయాంలో తీసుకున్న నిర్ణయాలే ఇప్పటి వరకు వివాదంగా మారుతూ వస్తున్నాయి. 2018 ఏప్రిల్ లో పుట్టా సుధాకర్ యాదవ్ ఛైర్మన్ గా ఉన్న టిటిడి పాలక మండలి ప్రమాణ స్వీకారం చేసిన నెలలోపే మిరాశి అర్చకుల రిటైడ్ మెంట్ చేయాలని నిర్ణయించింది.. దీనికి పాలక మండలి ఆమోదం తెలిపింది.దీంతో అర్చకుల వివాదం తెరపైకి వచ్చింది. తాజా నిర్ణయం తో రిటైర్డ్ అయ్యిన అర్చకులు మళ్లీ విధుల్లో పాల్గొనబోతున్నారు. అయితే , ప్రస్తుతం ఆ స్థానాల్లో కొనసాగుతున్న అర్చుకుల పై సందిగ్ధత నెలకొంది. వారికీ ఎలాంటి ఉత్తర్వులు టీటీడీ ఇంతకవరుకు జారీ చేస్తుందో ఇక వేచి చూడాలి.