Begin typing your search above and press return to search.

శ్రీవారి దర్శనాలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ !

By:  Tupaki Desk   |   2 Jun 2020 11:50 AM GMT
శ్రీవారి దర్శనాలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్  !
X
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తులకు ఏపీ సర్కారు శుభవార్త అందించింది. త్వరలోనే స్వామి వారి దర్శన భాగ్యాన్ని అందించేందుకు సుముఖత వ్యక్తం చేసింది. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఈవో అనిల్ సింఘాల్ రాసిన లేఖకు స్పందించిన జగన్ సర్కారు.. దర్శనానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జేఎస్వీ ప్రసాద్ ఉత్తర్వులు ఇచ్చారు.

అయితే, ముందుగా టీటీడీ ఉద్యోగులు, స్థానికులతో ట్రయల్ రన్ నిర్వహించాలని సూచించింది. ఒక భక్తుడికి, మరో భక్తుడికి మధ్య భౌతిక దూరం ఆరు అడుగులు ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపింది. గంటకు కేవలం 500 మందికి మాత్రమే శ్రీవారి దర్శనం లభించనున్నట్లు తెలుస్తోంది. అయితే శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి భ‌క్తుల‌ను అనుమ‌తిస్తే.. భ‌క్తులు కొండ‌పై విశ్రాంతి తీసుకునేందుకు అద్దె గ‌దుల‌ను కూడా ఇవ్వాల్సి ఉంటుంది. మ‌రి అందుకు టీటీడీ అనుమ‌తి ఇస్తుందో లేదో చూడాలి. ఈ మ‌హ‌మ్మారి నేప‌థ్యంలో తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యాన్ని గ‌త 80 రోజుల నుంచి మూసివేసిన సంగ‌తి తెలిసిందే. అయిన‌ప్ప‌టికీ స్వామి వారికి నిత్యం జ‌ర‌గాల్సిన పూజ‌లు, అభిషేకాల‌ను పండితులు య‌థావిధిగా నిర్వ‌హిస్తున్నారు.