Begin typing your search above and press return to search.
టీటీడీ ఎస్సీబీసీ కొత్త చైర్మన్ నియామకం.. ఇతడే
By: Tupaki Desk | 29 Oct 2020 4:00 AM GMTతిరుమల తిరుపతి దేవస్థానాలకు చెందిన ‘ఎస్వీబీసీ’ భక్తి చానెల్ కు కొత్త చైర్మన్ నియామకం అయ్యారు. సినీ నటుడు, 30 ఇయర్స్ ఫృథ్వీ వివాదాస్పద రీతిలో రాజీనామా చేశాక ఇన్నాళ్లు ఆ సీటు ఖాళీగా ఉంది. తాజాగా ప్రభుత్వం కొత్త చైర్మన్ ను నియమించింది.
నెల్లూరు జిల్లా వెంకటగిరికి చెందిన సాయికృష్ణ యచేంద్రను ఎస్వీబీసీ చానెల్ కొత్త చైర్మన్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మాజీ ఎమ్మెల్యే అయిన సాయికృష్ణ ఈ పదవిలో రెండేళ్ల పాటు ఉంటారు.
1985లో ఎన్టీఆర్ పిలుపు మేరకు సాయికృష్ణ యాచేంద్ర రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. వెంకటగిరి నుండి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. 2019 సార్వత్రిక ఎన్నికలలో, సాయికృష్ణ వైసిపికి తన మద్దతును అందించారు, సీటును త్యాగం చేసి సహకరించారు. ఆ కృతజ్ఞతతోనే సీఎం జగన్ అతడికి ఎస్విబిసి చైర్మన్ పోస్టును కట్టబెట్టారు.
జర్నలిస్ట్ స్వప్న.. దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి తదితరుల ఇతర పేర్లు కూడా ఎస్వీబిసి చైర్మన్ రేసులో వినపడ్డాయి. కానీ చివరికి పార్టీ కోసం కష్టపడ్డ సాయికృష్ణకు ఈ పదవి దక్కింది.
ఇక ఎస్వీబీసీ చైర్మన్ గా తొలుత నటుడు ఫృథ్వీ నియామకం అయ్యారు. అయితే ఆయన ఒక మహిళా ఉద్యోగితో వ్యవహరించిన తీరు, ఆడియోలు బయటపడి మీడియాలో హైలెట్ అయ్యింది. దీంతో ఆ పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి ఖాళీగా ఉన్న పోస్టును తాజాగా వైసీపీ ప్రభుత్వం భర్తీ చేసింది.