Begin typing your search above and press return to search.

ఆ పత్రిక మీద టీటీడీ రూ.100 కోట్ల పరువునష్టం దావా

By:  Tupaki Desk   |   29 Dec 2019 5:58 AM GMT
ఆ పత్రిక మీద టీటీడీ రూ.100 కోట్ల పరువునష్టం దావా
X
ఒక ధార్మిక సంస్థ తన మీద వచ్చిన ఒక వార్తా కథనం మీద తీవ్రంగా స్పందించిన వైనం ఇటీవల కాలంలో చూసింది లేదు. ఆ కొరతను తీరుస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సంచనలంగా మారింది. తమ పేరు ప్రతిష్టలను దెబ్బ తీసేలా.. భక్తుల మనోభావాలు దెబ్బ తినేలా తప్పుడు కథనాలను ప్రచురించిందన్న ఉద్దేశంతో ఒక పత్రిక (ఆంధ్రజ్యోతిగా చెబుతున్నారు) పైన రూ.100 కోట్ల పరువునష్టం కేసు వేయాలని నిర్ణయించారు. ఈ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఇంతకీ ఆంధ్రజ్యోతి మీద రూ.100 కోట్ల దావా వేయాలన్న తీవ్రమైన నిర్ణయాన్ని టీటీడీ ఎందుకు తీసుకున్నట్లు? అన్నది ప్రశ్నగా మారింది. ఆ మధ్యన టీటీడీ వెబ్ సైట్ ను హ్యాక్ చేసిన వేళ.. వెబ్ సైట్ లో వచ్చిన పదాలపై ఒక కథనాన్ని పబ్లిష్ చేసింది. దీనిపైనే టీటీడీ తీవ్రంగా రియాక్ట్ అయి.. ఈ కీలక నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా చెబుతున్నారు. ఈ నిర్ణయంతో పాటు పలు ఆసక్తికర నిర్ణయాల్ని తాజా టీటీడీ బోర్డు సమావేశం తీసుకుంది.

తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయ ప్రధాన ఆర్చకుడిగా రమణదీక్షతుల నియామకానికి ఆమోదం తెలిపిని టీటీడీ మరిన్ని నిర్ణయాల్ని తీసుకుంది. టీటీడీ తీసుకున్న కీలక నిర్ణయాలకు వస్తే..

% 2019-20 వార్షిక బడ్జెట్ కింద రూ. 3243కోట్లకు పాలక మండలి ఆమోదం

% ఘాట్ రోడ్డు మరమ్మతుల కోసం రూ. 10 కోట్లు, టీటీడీ పరిపాలనా భవనం మరమ్మతుల కోసం రూ. 14.30కోట్లు కేటాయింపు

% రూ. 14 కోట్లతో ముంబైలో శ్రీవారి ఆలయం నిర్మాణానికి ఆమోదం

% జమ్మూకాశ్మీర్ - వారణాసిలోనూ శ్రీవారి ఆలయ నిర్మాణం

% టీటీడీ ఆధ్వర్యంలో సైబర్ సెక్యూరిటీ విభాగం ఏర్పాటు. సోషల్ మీడియాలో టీటీడీపై తప్పుడు ప్రచారాన్ని అరికట్టేందుకు సైబర్ సెక్యూరిటీ విభాగం పని చేస్తుంది. దీనికి డీఎస్పీ స్థాయి అధికారిని నియామకం.

% 2019-20 శ్రీవారి హుండీ ఆదాయం రూ. 1285 కోట్లు - ప్రసాదాల విక్రయం ద్వారా రూ. 330 కోట్ల ఆదాయం సమకూరింది.

% జ‌న‌వ‌రి 6న వైకుంఠ ఏకాద‌శి - 7న ద్వాద‌శి సంద‌ర్భంగా రెండు రోజుల పాటు భ‌క్తుల‌కు వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం.