Begin typing your search above and press return to search.
టీ టీడీపీ బరిలో దిగే తమ్ముళ్లు వీరేనా?
By: Tupaki Desk | 22 Sep 2018 4:54 AM GMTకేసీఆర్ పుణ్యమా అని వచ్చి పడ్డ ముందస్తు ఎన్నికల ప్రక్రియ అంతకంతకూ వేడెక్కుతోంది. నిన్న మొన్నటి వరకూ కసరత్తు పేరుతో ముచ్చట్లు పెట్టుకోవటం తెలిసిందే. ఎంతకూ తెగని చర్చలు ఓ పక్క సాగుతుంటే.. ఆ వివరాలన్నీ బయటకు రాని పరిస్థితి దీంతో.. తెలుగుదేశం తరఫున బరిలోకి దిగే అభ్యర్తులపై స్పష్టత మిస్ అవుతోంది.
దీంతో.. ఎవరికి వారుగా తమకు సీటు వస్తుందంటే.. కాదు.. కాదు.తమకే వస్తుందని చెప్పుకోవటం ఎక్కువ అవుతోంది. ఈ నేపథ్యంలో అనవసరమైన తలనొప్పులు పెరుగుతున్నాయి.. పార్టీ అధినేతతో మాట్లాడామని.. ఆయన ఆశీస్సులు పొందినట్లుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. దీంతో ఎవరి నియోజకవర్గాల్లో ఎవరు పాగా వేస్తారో? పోటీ చేయాలని డిసైడ్ అవుతారో అర్థం కాక జుట్టు పట్టుకునే పరిస్థితి.
ఇదిలా ఉంటే.. గెలుపు మాత్రమే లక్ష్యంగా అభ్యర్థుల ఎంపిక ఉండాలన్న మాట నేతలంతా మూకుమ్మడిగా చెబుతున్నారు. అందరి మాట ఇలానే ఉన్నా.. తమ నియోజకవర్గానికి వచ్చేసరికి మాత్రం ఎవరికి వారు తామే బరిలో ఉన్నట్లుగా చెప్పుకోవటంతో కొత్త కన్ఫ్యూజన్ మొదలవుతోంది.
ఇలాంటి పరిస్థితులు పార్టీలో ఉన్న వేళ.. తాము పోటీ చేయాలనుకుంటున్న స్థానాల వివరాలతో పాటు అభ్యర్థుల పేర్లతో కూడిన జాబితాను టీ కాంగ్రెస్ చేతుల్లో పెట్టినట్లుగా చెబుతున్నారు.
తొలుత ముఫ్పై సీట్లలో పోటీ చేయాలని భావించినా.. గెలుపు గుర్రాల్ని మాత్రమే బరిలోకి దించాలన్న ఆలోచనతో కొద్దిమంది అభ్యర్థుల జాబితాను టీటీడీపీ అధినేత ఓకే చెప్పినట్లుగా చెబుతున్నారు. పొత్తుల్లో భాగంగా పక్కాగా గెలిచే సీట్ల మీదన దృష్టి పెట్టారు చంద్రబాబు. అభ్యర్తుల వడబోతలో తీవ్రంగా శ్రమించిన ఆయన ఒక లిస్ట్ ను సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన తెలుగుదేశం తాజా అభ్యర్థుల జాబితా వ్యవహారం నిజమో కాదో తెలీదు కానీ.. భారీగా వైరల్ అవుతోంది.
ఇదిలా ఉండగా.. ఉత్తమ్ చేతిలో తెలుగు తమ్ముళ్లు పెట్టిన అభ్యర్థుల లిస్ట్ ఇదేనంటూ బయటకు వచ్చిన వివరాల లెక్క చూస్తే..
దేవరకద్ర: రావుల చంద్రశేఖర్ రెడ్డి - మాజీ ఎమ్మెల్యే - మాజీ ఎంపీ.
మక్తల్ : కొత్తకోట దయాకర్ రెడ్డి - మాజీ ఎమ్మెల్యే. మహబూబ్‌నగర్/ చంద్రశేఖర్ (మాజీ ఎమ్మెల్యే)
రాజేంద్రనగర్: ఎమ్ భూపాల్ రెడ్డి - రంగారెడ్డి జిల్లా టీడీపీ అధ్యక్షుడు.
శేరిలింగంపల్లి: మండవ వెంకటేశ్వరరావు - మాజీ మంత్రి/ మొవ్వ సత్యనారాయణ
కూకట్ పల్లి: శ్రీనివాసరావు - కార్పొరేటర్
కంటోన్మెంట్ : ఎం.ఎన్.శ్రీనివాసరావు - గ్రేటర్ హైదరాబాద్ టీడీపీ అధ్యక్షుడు.
సికింద్రాబాద్: కూన వెంకటేష్ గౌడ్
ఉప్పల్: వీరేందర్ గౌడ్.
ఖైరతాబాద్ : బి.ఎన్.రెడ్డి - టీఎన్ టీయూసీ అధ్యక్షుడు.
కోరుట్ల: ఎల్ .రమణ - టీడీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు.
హుజూరాబాద్: ఇనగాల పెద్దిరెడ్డి - మాజీ మంత్రి.
ఆర్మూర్: ఏలేటి అన్నపూర్ణ - మాజీ ఎమ్మెల్యే.
పరకాల/ వరంగల్ వెస్ట్ : - రేవూరి ప్రకాష్ రెడ్డి.
ఆలేరు: శోభారాణి - తెలంగాణ టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు
కోదాడ: బొల్లం మల్లయ్యయాదవ్
మిర్యాలగూడ: శ్రీనివాస్ (వ్యాపార వేత్త - కమ్మ).
ఖమ్మం: నామా నాగేశ్వరరావు - మాజీ ఎంపీ.
సత్తుపల్లి: సండ్ర వెంకట వీరయ్య - ఎమ్మెల్యే.