Begin typing your search above and press return to search.
టీ అసెంబ్లీలో రేవంత్ సీటు నెంబర్ ఎంత?
By: Tupaki Desk | 11 March 2016 6:46 AM GMTతెలంగాణ అసెంబ్లీలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలకు తాజాగా సీట్లను మార్చారు. టీటీడీపీ నుంచి గెలుపొందిన 12 మంది ఎమ్మెల్యేలు తెలంగాణ అధికారపక్షంలోకి చేరటం.. వారి విలీన ప్రక్రియను స్పీకర్ మధుసూదనాచారి ఓకే చేయటం తెలిసిందే. విలీన ప్రక్రియ పూర్తి కావటంతో టీఆర్ ఎస్ లో చేరిన మాజీ తమ్ముళ్లకు వారి సీనియార్టీని అనుసరించి సీట్లను కేటాయించారు.
అదే సమయంలో టీటీడీపీ తరఫున మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేలకు కొత్తగా సీట్లు కేటాయించారు. తాజాగా జరిగిన మార్పులతో టీటీడీపీ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డికి ఐదో బ్లాక్ లో నాలుగో వరుసలో 123వ సీటును కేటాయించారు. ఇక.. పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు అదే బ్లాక్ లో మూడో వరుసలో 118వ సీటును.. ఆర్ కృష్ణయ్యకు 124వ నెంబరును కేటాయించారు.
ఇక.. టీఆర్ ఎస్ లో విలీనం అయిన 12 మంది తమ్ముళ్ల విషయానికి వస్తే..
మూడో బ్లాక్ లో మొదటి లైన్లో మంత్రిగా వ్యవహరిస్తున్న తలసానికి.. అదే బ్లాక్లో రెండో వరుసలో ఎర్రబెల్లి దయాకర్.. సాయన్నలకు సీట్లు కేటాయించారు. నాలుగో లైన్లో రాజేందర్ రెడ్డికి.. బ్లాక్ ఒకటిలో ఐదో లైన్లో మంచిరెడ్డి కిషన్ రెడ్డికి.. రెండో బ్లాక్ నాలుగోలైన్లో మాధవరం కృష్ణారావు.. తర్వాత సీట్లో తీగల కృష్ణారెడ్డి.. నాలుగో బ్లాక్ మూడో వరుసలో మాగంటి గోపీనాథ్.. ధర్మారెడ్డి.. అరేకెపూడి గాంధీలకు సీట్లు కేటాయించారు. ఇక.. నాలుగో లైన్లో వివేక్ కు .. ఐదో బ్లాక్ రెండో లైన్లో ప్రకాశ్ గౌడ్ కు సీట్లు కేటాయించారు. దీంతో.. తమ్ముళ్ల విలీన ప్రక్రియ సంపూర్ణమైనట్లే.