Begin typing your search above and press return to search.
తెలంగాణ ముందా? తెలుగుదేశం ముందా?
By: Tupaki Desk | 16 Feb 2016 11:30 AM GMTతెలంగాణ తెలుగుదేశం పార్టీ పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలంతా కారెక్కి పారిపోతుంటే ఉన్న ఒకరిద్దరు పార్టీ తలరాత మార్చడానికి మీటింగులు పెట్టుకుంటున్నారు. పార్టీని బాగు చేయడానికి ఉన్న అవకాశాలను మాట్లాడడం మానేసి ... జ్యోతిష్యాలు, సాంఖ్యక శాస్త్రాలు వంటివి నమ్ముతూ పార్టీ పేరును, పిలిచేవిధానాన్ని మార్చి లక్కు కలిసొస్తుందేమో చూడాలనుకుంటున్నారు. ప్రస్తుతం తెలంగాణలోని తెలుగుదేశం పార్టీని వాడుకలో టీటీడీపీ అని, తెలంగాణ తెలుగుదేశమని అంటున్నారు. దీంతో తెలుగుదేశం కంటే ముందు ఇంకే పదం ఉండకుండా చూసుకుంటూ పరిస్థితులు చక్కబడతాయని భావిస్తున్నారు. అలా చేస్తే పార్టీకి పూర్వవైభవం వస్తుందని ఆశపడుతున్నారు.
టీటీడీపీ నేతలు ఇటీవలి పరిణామాలపై చర్చించడానికి... పార్టీని బలోపేతం చేయడం గురించి మాట్లాడుకోవడానికి హైదరాబాద్‌లో ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేసుకున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రేవంత్‌రెడ్డి, పొలిట్‌బ్యూరో సభ్యులు, ఇతర ముఖ్యనేతలు పాల్గొని పార్టీ పరిస్థితి, భవిష్యత్ కార్యాచరణ, ఇతర అంశాలు చర్చించారు. పార్టీని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా క్షేత్రస్థాయి కార్యాచరణ చేపట్టాలని డిసైడయ్యారు. అయితే... వాటితో పాటు కాస్త సెంటిమెంటుకు సంబంధించిన అంశాల్లోనూ మార్పులు చేర్పులు చేసి చూడాలని భావించారు. అందులో భాగంగానే పార్టీ పేరును సవరించాలని నిర్ణయించారు. అలా అని పేరు పూర్తిగా మార్చేయకుండా పిలిచే విధానంలో చిన్నపాటి మార్పు చేసుకోబోతున్నారు. ఇందుకోసం రాష్ట్రంలో పార్టీల గత చరిత్రను చూశారు. తెలుగు దేశం అన్న పేరుతో వచ్చిన తమ పార్టీ ప్రభంజనం సృష్టించగా... అన్న తెలుగుదేశం, సామాజిక తెలుగుదేశం, ఎన్టీఆర్ తెలుగుదేశం తదితర పేర్లతో వచ్చిన పార్టీ ఏమయ్యాయో కూడా జాడ లేవని... ఇప్పుడు తెలంగాణలో తెలుగుదేశం పార్టీని తెలంగాణ తెలుగుదేశం అంటుండడంతో వాటిలాగే పార్టీ దెబ్బతింటోందని అభిప్రాయపడ్డారు. అందుకే తెలుగుదేశం అన్న పదానికి ముందు ఇంకే పదం లేకుండా ఇక నుంచి 'తెలుగుదేశం తెలంగాణ శాఖ'గా పిలవాలని నిర్ణయించారు. టీడీపీ అన్నదానికి ముందు ఇతర పదాలుంటే కష్టమని పండితులు కూడా చెప్పారట. ఇప్పటికే టీటీడీపీ దీనిపై నిర్ణయం తీసుకున్నా... ఈ నెల 19న హైదరాబాద్ లో పార్టీ అధినేత చంద్రబాబుతో జరిగే ప్రత్యేక భేటీలో ఆయకు విషయం చెప్పి పూర్తి నిర్ణయం తీసుకోబోతున్నారు. మరి పేరు మార్చిన తరువాతైనా ఫేటు మారుతుందేమో చూడాలి.