Begin typing your search above and press return to search.

చివరకు మిగిలేది ఆ ఇద్దరు తమ్ముళ్లేనా?

By:  Tupaki Desk   |   5 March 2016 4:03 AM GMT
చివరకు మిగిలేది ఆ ఇద్దరు తమ్ముళ్లేనా?
X
తెలంగాణ తెలుగుదేశం పార్టీని ఒక పట్టు పట్టేందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్టార్ట్ చేసిన ఆపరేషన్ ఆకర్ష్.. ఆపరేషన్ ఫినిష్ తో పూర్తి కానుంది. తాజాగా తెలంగాణ అధికారపక్షంలోకి చేరిన ప్రకాష్ గౌడ్ తో తెలంగాణ తెలుగుదేశం పార్టీలో మిగిలింది ఐదుగురు ఎమ్మెల్యేలు మాత్రమే. వీరిలో శేరిలింగంపల్లి ఎ.గాంధీ.. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్.. ఎల్ బీ నగర్ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య.. కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి.. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యలు మాత్రమే మిగలనున్నారు. వీరిలో ఎల్ బీ నగర్ ఎమ్మెల్యే కృష్ణయ్య పార్టీకి సంబంధం లేనట్లుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

ఇక.. మిగిలిన నలుగురిలో మరో ఇద్దరు ఎమ్మెల్యేలు గాంధీ.. గోపీనాథ్ లు కూడా కారు ఎక్కే ప్రయత్నాల్లో ఉన్నారని స్పష్టం చేస్తున్నారు. ఈ అంచనాలు కానీ నిజమైతే తెలంగాణ తెలుగుదేశం పార్టీలో మిగిలేది ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే అవుతుంది. అదే జరిగితే.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కోరుకున్నట్లే ఆపరేషన్ ఆకర్ష్ తో మొదలై.. ఆపరేషన్ ఫినిష్ తో పూర్తి అయినట్లే.

టీటీడీపీలో కొనసాగుతున్న మాగంటి గోపీనాథ్.. ఎ.గాంధీలు పార్టీని విడిచిపెట్టమని చెబుతున్నప్పటికీ.. అది సాధ్యం కాదని.. వారిపై ఒత్తిడి పెద్ద ఎత్తున ఉందని చెబుతున్నారు. టీటీడీపీ లేకుండా చేయటమే లక్ష్యంగా పెట్టుకున్న కేసీఆర్.. తాను అనుకున్నది పూర్తి చేయటానికి మరో ఇద్దరు ఎమ్మెల్యేలు మిగిలి ఉన్నారని చెబుతున్నారు. అదే జరిగితే.. ఓటుకు నోటు కేసులో నిందితులుగా ఉన్న రేవంత్.. సండ్రలు మాత్రమే టీటీడీపీలో మిగులుతారని చెప్పొచ్చు.