Begin typing your search above and press return to search.
అలా చేస్తే కేసీఆర్ భూమి మీదకు వస్తారంట
By: Tupaki Desk | 16 March 2015 10:43 AM GMTతెలంగాణ అసెంబ్లీలో సస్పెండ్ అయిన తెలంగాణ తెలుగుదేశం నేతలు మరోసారి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్న తెలంగాణ అధికారపక్షంపై తాము కేంద్ర ఎన్నికల సంఘానికి.. రాష్ట్రపతికి ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించారు.
ఇందుకు కోసం మంగళవారం ఢిల్లీ వెళ్లనున్నట్లు ప్రకటించారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించేలా ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.పిరాయింపులపై స్పీకర్‌కు.. గవర్నర్ కు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేదని వాపోయిన వారు.. ఢిల్లీలో తమకు న్యాయం జరుగుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
పిరాయింపులపై హైకోర్టు నోటీసులు ఇచ్చినా ప్రయోజనం లేకుండా పోయిందని వారు విరుచుకుపడుతున్నారు. అందుకే.. మండలి ఎన్నికల్లో టీఆర్ ఎస్ అభ్యర్థులను ఓడిస్తే.. గాల్లో తిరుగుతున్న కేసీఆర్ భూమి మీదకు వస్తారని విమర్శించారు. మొత్తానికి సభలో లేకున్నా.. నిత్యం ఏదోలా వార్తల్లో నానుతూ.. తెలంగాణ అధికారపక్షంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతూ తమ్ముళ్లు శ్రమిస్తున్నారు.