Begin typing your search above and press return to search.
రేవంత్ ఎఫెక్ట్: ఖాళీ అవుతున్న టీటీడీపీ
By: Tupaki Desk | 30 Oct 2017 5:02 AM GMTరాచపీనుగ పోయేటప్పుడు ఊరికే పోదని.. తనతో ఎంతోకొంతమందిని తీసుకుపోతుందంటారు. తెలుగుదేశం ఫైర్ బ్రాండ్ గా సుపరిచితుడైన రేవంత్ రెడ్డి పరిస్థితి ఇంచుమించు ఇదే రీతిలో ఉందని చెప్పాలి. టీడీపీకి గుడ్ బై చెప్పిన రేవంత్ రెడ్డితో పాటు భారీగా పార్టీలో రాజీనామాలు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకూ నేతలు ఈ జాబితాలో ఉండటం గమనార్హం.
రాష్ట్ర విభజన.. తదనంతర పరిణామాల నేపథ్యంలో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి నామమాత్రంగానే ఉంది. తాజాగా రేవంత్ రెడ్డి రాజీనామా అనంతరం ఉన్న కొద్దిపాటి క్యాడర్ కూడా పార్టీకి గుడ్ బై చెప్పేస్తున్నారు. మరికొందరు ఆ బాటలో పయనిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే.. తెలంగాణ తెలుగుదేశం పార్టీలో పేరుకు కొందరు నేతలు మినహా మొత్తంగా పార్టీ ఖాళీ అయిపోయినట్లే.
రేవంత్ తో సహా.. తాజాగా పార్టీకి రాజీనామా చేస్తున్న వారి నోటి నుంచి వస్తున్న మాట ఒక్కటే. రాష్ట్రంలో సిద్ధాంతాలు.. విధానాలకు అతీతంగా ఒక బలమైన వేదిక రూపుదిద్దుకోవాల్సిన అనివార్యత ఏర్పడిందని.. అధికారపక్షానికి బలమైన ప్రత్యామ్నాయంగా తయారు కావాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. ఈ కారణంగానే తాము పార్టీని వీడుతున్నట్లుగా వారు చెబుతున్నారు. తామును పార్టీకి దూరం కావటానికి ప్రత్యేక పరిస్థితులే కారణంగా వారు చెబుతున్నారు.
ఇదిలా ఉంటే.. తనకు ఎమ్మెల్యే క్వార్టర్ లో కేటాయించిన ఇంటిని రేవంత్ ఖాళీ చేశారు. నిజానికి ఈ క్వార్టర్ లో రేవంత్ రెడ్డి ఉండటం లేదు. టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి ఉంటున్నారు. రేవంత్ పార్టీకి రాజీనామా చేసిన నేపథ్యంలో.. ఆయన చేసిన సూచన నేపథ్యంలో క్వార్టర్ ఖాళీ చేసినట్లుగా చెబుతున్నారు. మరోవైపు హైదరాబాద్ లోని జలవిహార్ లో రేవంత్ నిర్వహించాలని భావిస్తున్న సమావేశానికి అనుమతి లేదని సెంట్రల్ జోన్ డీసీపీ జోయల్ డేవిస్ వెల్లడించారు. సమావేశం కోసం రేవంత్ దరఖాస్తు చేసుకోలేదని.. అందుకే అనుమతి ప్రసక్తే ఉండదన్నారు. ఈ నేపథ్యంలో సమావేశాన్ని రేవంత్ తన ఇంటికి మార్చుకున్నారు.
టీడీపీని వీడుతున్న ముఖ్యనేతల్ని చూస్తే..
* సీహెచ్. విజయరమణరావు (మాజీ ఎమ్మెల్యే - పెద్దపల్లి)
* వేం నరేందర్ రెడ్డి (మాజీ ఎమ్మెల్యే - వరంగల్ జిల్లా)
* బోడ జనార్ధన్ (మాజీ మంత్రి - ఆదిలాబాద్ జిల్లా)
* అరికల నర్సారెడ్డి (మాజీ ఎమ్మెల్సీ - నిజామాబాద్ రూరల్)
* కత్తెర గంగాధర్ (మాజీ ఎమ్మెల్యే - బాన్సువాడ)
* దొమ్మటి సాంబయ్య (వరంగల్)
* సోయం బాపురావు (మాజీ ఎమ్మెల్యే - బోథ్)
* జి.సావిత్రమ్మ (మాజీ ఎమ్మెల్సీ - మహబూబాబాద్)
* గంగాధర్ గౌడ్ ( మాజీ ఎమ్మెల్యే - నిజామాబాద్)
* మేడిపల్లి సత్యం (చొప్పదండి)
* కె.భూపాల్ రెడ్డి (నల్గొండ)
* బట్టి జగపతి (మెదక్)
* కొప్పుల నర్సింహారెడ్డి (ఎల్బీనగర్)
* పొట్ల నాగేశ్వర్ రావు (మాజీ ఎమ్మెల్సీ - ఖమ్మం)