Begin typing your search above and press return to search.
పచ్చ వ్యూహం:రేవంత్ ను అలా... దెబ్బకొడదాం
By: Tupaki Desk | 27 Oct 2017 7:56 AM GMTతెలంగాణలో రాజకీయ పరిణామాలు రంజుగా మారుతున్నాయి. గత కొద్ధి రోజులుగా రేవంత్ రెడ్డి వ్యవహారశైలి - ఢిల్లీ పర్యటనలో రాహుల్ గాంధీతో భేటీ తదనంతర పరిణామాలతో తెలుగుదేశంపార్టీలో సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతిపక్షంతో పోరాటం మాట... అటుంచితే... స్వపక్షంలోనే విపక్షనేతలు తయారయ్యారు. తెలుగుదేశంపార్టీ శాసనసభాపక్షనేత రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి మారే ప్రయత్నం తెదేపా శ్రేణుల్ని కలరవపెట్టింది. తెలంగాణలో ద్వితీయ శ్రేణి నాయకులను - పార్టీ కార్యకర్తలతో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వలస పోతున్నారని పసిగట్టిన నేతలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరకముందే రేవంత్ రెడ్డిని తెదేపాలో పార్టీ పదవులనుంచి తప్పించేందుకు రాష్ట్ర నాయకులు నిర్ణయించారు.
తాజాగా పచ్చ వ్యూహం ఏంటంటే.. రేవంత్ రెడ్డి వెంట ప్రముఖులెవరూ వెళ్లకుండా నిలువరించడం. తద్వారా రేవంత్ కు సొంత హవా పెద్దగా ఏమీ లేదనే అభిప్రాయాన్ని కాంగ్రెసుకు కలిగించడం. ఇందుకోసం ఆయన అనుచరగణాన్ని , సన్నిహిత సీనియర్ నాయకుల్ని తాయిలాలతో నిలువరించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. మందీమార్భలంతో వెళ్లి కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి చక్రం తిప్పేస్థాయి కల్పనకు అవకాశంలేకుండా చేయాలని రాజకీయంగా చెక్ పెట్టేందుకు సమాయాత్తమయ్యారు. నియోజకవర్గస్థాయి నాయకులను - కార్యకర్తలను కాంగ్రెస్ పార్టీలోకంటే గులాబీగూటికి చేరేందుకు పరోక్షంగా ప్రోత్సహిస్తున్నారు. రేవంత్ రెడ్డిని రాజకీయంగా దెబ్బతీయాలని తెలంగాణ టిడిపి అధ్యక్షులు ఎల్.రమణ - తెలుగుదేశంపార్టీ సీనియర్ నాయకులు మోత్కుపల్లి నర్సింహులు - అరవింద్ గౌడ్ నిర్ణయించారు. శాసనసభ సమావేశాలకు ముందురోజే శాసన సభా పక్ష కార్యాలయానికి తాళంవేసి గోల్కొండహోటల్ లో మిత్ర పక్షం నేతలతో సమావేశమై సమాలోచనలు చేశారు. తెలుగుదేశంపార్టీ అధినేత విదేశీయాత్రలో ఉన్నపుడు తనపై పార్టీ పరంగా చర్యతీసుకునే స్థాయి ఎవ్వరికీ లేదని రేవంత్ రెడ్డి ఎదురుదాడికి దిగారు. పొద్దుపొడుపు రాజకీయాలు చేసే తెలుగుదేశంపార్టీ నాయకులకు సమాధానం చెప్పాల్సిన అవసరంలేదని రేవంత్ రెడ్డి బాహటంగా విమర్శించారు.
కేంద్రంలో మిత్రపక్షమైన బీజేపీ... తెలంగాణలో తెలుగుదేశంపార్టీతో కలిసి నడిచేది లేదని తెగేసి చెప్పిన బీజేపీ నాయకులతో తెలుగుదేశంపార్టీ నాయకుల దోస్తీ ఏంటని రేవంత్ ప్రశ్నించారు. తెరాస అధినేత చంద్రశేఖరరావే తన లక్ష్యమని ప్రాణాలను పణంగా పెట్టి పోరాటం చేస్తున్నానని రేవంత్ రెడ్డి చెప్పారు. తెలంగాణ రాజకీయాల్లో తన సత్తా ఏంటోనని నిరూపిస్తానంటున్న రేవంత్ రెడ్డి పార్టీ మారే ప్రయత్నంలో ఆయన్ని ఏకాకి చేసి కాంగ్రెస్ పార్టీలో ప్రాధాన్యత ఇవ్వనీకుండా చేయాలని తెదేపా శ్రేణులు కుయుక్తులు చేస్తున్నారు. కార్యకర్తల వలస ప్రయత్నాన్ని నిలువరించి రేవంత్ రెడ్డిని ఒక్కడే పార్టీ మారితే ఇబ్బంది లేకుండా వుంటుందనే దిశగా పావులు కదుపుతున్నారు.