Begin typing your search above and press return to search.
రేవంత్ ను ఓడిస్తే చాలు : టీటీడీపీ ఫోకస్ !
By: Tupaki Desk | 31 Oct 2017 4:25 AMరేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరుతున్న పరిణామాలు తెలంగాణ తెలుగుదేశం పార్టీలో మిగిలిన నాయకులకు తీవ్ర అసహనం కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రేవంత్ ఎగ్జిట్ అనంతర పరిణామాలు - పర్యవసానాలు - ప్రభావాలు.. వ్యూహరచన గురించి చర్చించుకోవడానికి తెతెదేపా నాయకులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఇప్పుడు వారికి ఒకటే లక్ష్యం కనిపిస్తోంది. కొడంగల్ స్థానానికి ఉప ఎన్నిక రాగానే.. అక్కడ రేవంత్ రెడ్డి ని చిత్తుచిత్తుగా ఓడించాలని చాలా పట్టుదలగా కనిపిస్తున్నారు. కొడంగల్ లో ఎట్ట పరిస్థితుల్లోనూ రేవంత్ ను ఓడిస్తాం అంటూ ప్రతిజ్ఞలు చేస్తున్నారు. తెలుగుదేశం అభిమానులు ఓట్లు వేస్తేనే రేవంత్ రెడ్డి గెలిచారని - ఆయనకు ఆ సంగతి తెలిసొచ్చేలా చేస్తాం అని తెదేపా నాయకులు అంటున్నారు.
రేవంత్ వ్యవహారం తెలంగాణ తెలుగుదేశంలో మిగిలిన నాయకులకు చాలా ఇబ్బంది కరమైన అంశంలాగా తయారైంది. రేవంత్ వెళ్లిపోతున్నారనే వార్త బయటకు రాగానే.. అధికారంలో ఉన్న తెరాస యాక్టివేట్ అయి.. కొడంగల్ లో పలువురు చిన్న చిన్న తెదేపా నాయకులను తమ పార్టీలో కలిపేసుకుంటోంది. ఈ రకంగా అటు ఎమ్మెల్యే స్థాయిలోనూ, ఇటు కార్యకర్తల స్థాయిలోనూ కూడా తెలుగుదేశం నష్టపోతున్నది. రేవంత్ కు నమ్మిన బంట్లుగా ఉండే అనుచరులు.. ఎటూ ఆయనవెంట వెళ్లిపోయే నేపథ్యంలో ఆ నియోజకవర్గంలో పార్టీ ఖాళీ అయినా ఆశ్చర్యం లేదు. అయినప్పటికీ తెలుగుదేశ నాయకులు మాత్రం చాలా డాంబికంగా ప్రకటనలు చేస్తున్నారు. కొడంగల్ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికలో రేవంత్ రెడ్డిని ఓడించి సత్తా నిరూపిస్తాం అంటున్నారు. ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా ప్రభుత్వంలోకి వచ్చి ప్రగతి భవన్ మీదనే జెండా ఎగరేస్తాం అనికూడా అంటున్నారు.
అయితే తెదేపా మరో రకంగా కూడా మేకపోతు గాంభీర్యాన్ని కూడా ప్రదర్శిస్తోంది. మార్చి 29వ తేదీలోగా (అంటే రేవంత్ రాజీనామా చేసిన అయిదు నెలల గడువు) అక్కడ ఉప ఎన్నిక జరగకపోతే.. తెలుగుదేశం నాయకులే నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజాబ్యాలెట్ నిర్వహిస్తారుట. అందులో తెరాస - కాంగ్రెస్ లకంటె కూడా ఎక్కువ ఓట్లు సాధిస్తారట. ప్రజాబ్యాలెట్ లో ఓట్లు సాధించడం అంటే.. మీకు వేసే వారి వద్దకు మీరు వెళ్లి వేయించుకోవడమే.. ఇలా ఆ రెండు పార్టీలకంటె ఎక్కువ ఓట్లు సాధించడం అనేది.. ప్రజాబ్యాలెట్ లో కాదు.. ఉప ఎన్నికల బ్యాలెట్ లోనూ సాధించగలమని సవాలు చేయగలరా? అనే ప్రశ్న ప్రజల్లో వినిపిస్తోంది.