Begin typing your search above and press return to search.
లోకేశ్ వద్దు.. జూనియర్ కావాలనుడేంటి?
By: Tupaki Desk | 21 Jan 2016 9:07 AM GMTగ్రేటర్ ఎన్నికల సందర్భంగా ప్రధాన రాజకీయ పార్టీలన్నింటికి ఊహించని షాక్ తగిలింది. టిక్కెట్ల పంపిణీలో చోటు చేసుకున్న అసంతృప్తి సెగ ప్రతి రాజకీయ పార్టీని ఇబ్బంది పెట్టింది. తెలంగాణ అధికారపక్షంతో పాటు.. విపక్ష కాంగ్రెస్.. తెలుగుదేశం పార్టీలకు తప్పలేదు. మిగిలిన పార్టీలతో పోలిస్తే.. తెలంగాణ తెలుగుదేశంలో ఇబ్బందికర పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఆ పార్టీకి భావినేతగా భావిస్తున్న లోకేశ్ పై తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమైంది. టిక్కెట్లు ఆశించి భంగపడిన నేతలు అసంతృప్తితో పార్టీ ప్రధాన కార్యాలయంలో లోకేశ్ ఫ్లెక్సీని చించివేయటం జరిగింది.
లోకేశ్ ఫ్లెక్సీ చించివేత ఒకటైతే.. జూనియర్ ఎన్టీఆర్‌కు టీటీడీపీ బాధ్యతలు అప్పగించాలన్న డిమాండ్ తెర మీదకు రావటం ఆసక్తికరంగా మారింది. తెలంగాణ తెలుగుదేశం పార్టీకి ముఖ్యనేతలైన రేవంత్ రెడ్డితో మొదలు పలువురు నేతలపై తీవ్ర ఆరోపణ చేసిన అసంతృప్త తమ్ముళ్లు.. ఊహించని విధంగా జూనియర్ ఎన్టీఆర్ కు పగ్గాలు ఇవ్వాలని కోరటం ద్వారా పార్టీలో కొత్త చర్చకు తావిచ్చారు.
తాను బతికి ఉన్నంతవరకూ తెలుగుదేశం పార్టీలో సభ్యుడినేనని గతంలో జూనియర్ చెప్పినా.. గత కొద్దినెలలుగా చోటు చేసుకున్న పరిణామాలతో ఆయన పార్టీకి దూరంగా ఉండటం తెలిసిందే. జూనియర్ ను దూరంగా ఉంటున్నారనే కంటే కూడా.. ఆయన దూరంగా ఉంచుతున్నారన్న మాట సబబుగా ఉంటుంది. పార్టీకి.. జూనియర్ కు దూరం రోజురోజుకి పెరుగుతున్న సమయంలో.. ఊహించని రీతిలో జూనియర్ ఎన్టీఆర్ పేరును అసంతృప్త తమ్ముళ్లు తెర మీదకు తేవటంతో పార్టీ అధినాయకత్వం ఉలిక్కిపడిన పరిస్థితి. ఓపక్క లోకేశ్ ఫ్లెక్సీని చించేసి ఘటన పార్టీకి షాక్ గా మారితే.. అదే సమయంలో జూనియర్ కు తెలంగాణ పగ్గాలు ఇవ్వాలని చెప్పటం డబుల్ షాక్ గా మారిందని చెప్పక తప్పదు. టిక్కెట్లు రాని అసంతృప్తుల వ్యవహారం కొద్దిరోజుల్లో కొలిక్కి వచ్చినా.. జూనియర్ ప్రస్తావన ద్వారా చోటు చేసుకున్న కలకలం మాత్రం ఇప్పట్లో సద్దుమణిగేలా లేదన్న మాట వినిపిస్తోంది.