Begin typing your search above and press return to search.
తెలుగుదేశం ఓటు అక్కడ ఎటు పడుతుంది?
By: Tupaki Desk | 30 March 2019 5:30 PM GMTతెలంగాణ ఎన్నికల పోరు నుంచి తెలుగుదేశం పార్టీ డ్రాప్ అయ్యింది. తాము తెలంగాణ ఎన్నికల్లో పోటీలో ఉండటం లేదని టీటీడీపీ నేతలు ప్రకటించేశారు. ఆ పార్టీ తరఫున తెలంగాణలో ఎక్కడా నామినేషన్లు పడలేదు. ముప్పై ఏడేళ్ల కిందట ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీ.. ఇలా తొలి సారి సార్వత్రిక ఎన్నికల పోటీ నుంచి తప్పుకుంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది తెలంగాణ గడ్డ మీద ఇటీవలి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కూడా ఆ పార్టీ నేతలు ఊదరగొట్టారు. అలాంటి తెలంగాణ గడ్డ మీద ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో పోటీలో లేదు.
తమ మద్దతు కాంగ్రెస్ పార్టీకి అని తెలుగుదేశం నేతలు ప్రకటించేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ- కాంగ్రెస్ లు కలిసి బరిలోకి దిగడం వల్ల కాంగ్రెస్ చాలా వరకూ నష్టపోయిందనే విశ్లేషణలు ఉన్నాయి.అందుకే కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం తో పొత్తుకు ఇప్పుడు రెడీగా లేదని అంటున్నారు. అలాగని తెలుగుదేశం సోలోగా పోటీ చేసినా.. గెలిచేది ఉండదు, పైపెచ్చూ ఏవైనా ఓట్లు చీలతాయేమో అని.. తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించేసి బరువు దించేసుకుంది!
మరి ఇంతకీ ఇప్పుడు లోక్ సభ సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓట్లు ఎటు పడతాయి? అనేది ఆసక్తిదాయకమైన అంశం. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఎంత చెడినా.. దాని ఓటు బ్యాంకు అంటూ ఎంతో కొంత ఉండనే ఉంటుంది. అతి తక్కువగా చూసుకున్నా.. తెలంగాణ మొత్తం మీద మూడు నాలుగు శాతం అయినా తెలుగుదేశం పార్టీ ఓటు బ్యాంకు ఇప్పటికి మిగిలే ఉంటుంది. ఇలాంటి నేపథ్యంలో లోక్ సభ సార్వత్రిక ఎన్నికల్లో అది ఎటు పడుతుంది? అనేది ఆసక్తిదాయకమైన అంశం.
తెలుగుదేశం పార్టీ వాళ్లు తమ మద్దతు కాంగ్రెస్ కు అని ప్రకటించేశారు కాబట్టి..ఆ ఓటుబ్యాంకు గంపగుత్తగా కాంగ్రెస్ పడే అవకావాలున్నాయా? అనేది ప్రశ్నార్థకమే. తెలంగాణ రాష్ట్ర సమితి అంటే పడని తెలుగుదేశం వాళ్లు మాత్రం కాంగ్రెస్ కు ఓటేయక తప్పని పరిస్థితుల్లో ఉన్నట్టే. అయితే.. కాంగ్రెస్ అంటే ఏమాత్రం పడని తెలుగుదేశం అభిమానులు కూడా ఏదో కొద్ది మాత్రం ఉండకపోరు.
టీడీపీ పై స్థాయి నేతలు కాంగ్రెస్ తో చేతులు కలిపినా.. కొంతమంది గ్రామస్థాయి వాళ్లు మాత్రం అలా కలవలేరు. ఇలాంటి వారు ఇప్పుడు కాంగ్రెస్ వైరి పక్షాలుగా తెలంగాణలో బరిలో ఉన్న తెరాస వైపు మళ్లవచ్చు. ఇదే సమయంలో వారికి బీజేపీ కూడా ఒక ఛాయిస్ గా ఉంది. బీజేపీ వాళ్ల మీదా కూడా బాబు ఇప్పుడు ఫైర్ అవుతున్నారు. మరి తెలంగాణలో ఇంకా మిగిలే ఉన్న టీడీపీ సంప్రదాయ ఓటు బ్యాంకు రూటెటో!