Begin typing your search above and press return to search.
వారికి.. చిన్న 'మమ్మీ' రిటర్న్స్..!
By: Tupaki Desk | 24 Dec 2017 11:16 AM GMTమాటల్లేవ్. మాట్లాడుకోవడాలు లేవ్. ఇంక.. ఫేస్ టు ఫేస్ చూసుకోవటమే. తమిళనాడు రాజకీయం రానున్న రోజుల్లో ఎలా ఉంటుందన్నది ఇలా చెప్పేయొచ్చు. కేసులు చుట్టుముట్టి.. శిక్ష అనుభవిస్తున్న చిన్నమ్మకు ఇప్పుడు భారీ ఊరట. ఢిల్లీలో మోడీ ఉన్నా లేకున్నా.. ఇంకే అపన్న హస్తం ఉన్నా లేకున్నా.. తమిళ ప్రజలు తన వెంటే ఉన్నారన్న చిన్న సందేశం ఇప్పుడు ఆమెకు కొండంత బలాన్ని తెచ్చి పెడుతుందనటంలో సందేహం కాదు.
ఆ మాటకు వస్తే.. అమ్మకు.. చిన్నమ్మకు ఎదురుదెబ్బలు.. గడ్డుపరిస్థితులు కొత్తేం కావు. జైలు జీవితం కూడా తెలియంది కాదు. కనుచూపుతో శాసించటం తెలుసు.. ఊహించని దెబ్బలు తగిలినప్పుడు మౌనంగా ఉండటం తెలుసు. అమ్మ మరణించిన తర్వాత.. తెర వెనుక జరిగిన పరిణామాల నేపథ్యంలో సీఎం సీట్లో తాను కూర్చుంటే తప్పించి లెక్కలు సరిగా ఉండవని పీలైన చిన్నమ్మ.. ఆ దిశగా పావులు కదిపారు.
అంతే అప్పటివరకూ అమ్మ దగ్గర ఏ రీతిలో అయితే వంగి.. వంగి సలాములు పెడతారో.. అదే రీతిలో వంగిపోయి విధేయతను ప్రదర్శించిన పన్నీరు సెల్వం అమ్మ ఏదో ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పి వీరంగం వేశారు. తిరుగుబాటు బావుటా వేశారు. ఇలాంటివి చాలానే చూశామన్నట్లుగా చిన్నమ్మ లైట్ తీసుకున్నప్పటికీ.. అసలు దెబ్బ తాను నమ్మిన పళనిస్వామి వేయటంతో ఆమె కోలుకోలేకపోయారు.
మలార్ గుడి మాఫియా అన్న చెడ్డపేరును మూట గట్టుకున్న తమకు ప్రజామద్దతు ఎలా సాధించాలో అర్థం కాక కిందా మీదా పడుతున్న చిన్నమ్మకు మోడీ రూపంలో ఇప్పుడు అనుకోని ఆశాకిరణం వెతుక్కుంటూ వచ్చింది. దేనినైనా సహిస్తాడు కానీ.. తన ఆత్మాభిమానానికి ఇబ్బంది కలిగించే ఎంతటి పవర్ ను అయినా ఢీ కొట్టేందుకు సిద్ధంగా ఉండే తమిళుడికి.. తమ రాష్ట్రం మీద మోడీ అండ్ కో కన్నేయటం అస్సలు నచ్చలేదు. మోడీతో కలిసేందుకు చిన్నమ్మ మొదట్నించి పెద్దగా ఆసక్తి ప్రదర్శించకపోవటం.. అదే సమయంలో.. ఆమె తీరుకు భిన్నంగా.. పళని.. పన్నీరు ద్వయం మోడీ మాష్టారికి జీ హుజుర్ అన్నట్లుగా వ్యవహరించటంతో లెక్కలు మారిపోయాయి.
అదే సమయంలో అపోలో ఆసుపత్రిలో అమ్మకు ఏదేదో చేశారంటూ జరిగిన ప్రచారంలో నిజం లేదన్న విషయం ఆర్కే నగర్ ఉప ఎన్నిక పోలింగ్ రోజుకు ముందు రోజు బయటకు రావటంతో ఆర్కే వాసులతో పాటు.. తమిళ లోకానికి అపోలో ఎపిసోడ్ లో మరీ అనుమానించాల్సిన అంశాలు లేవన్న భావనకు వచ్చారని చెప్పాలి. వీటన్నింటి కంటే.. మోడీ ఆశీస్సులు ఉన్న పార్టీకి ఎట్టి పరిస్థితుల్లో ఓట్లు వేయకూడదన్నట్లుగా వారి తీరు ఉందన్న విషయం పోలింగ్ జరిగిన తీరు చూస్తే అర్థమవుతుంది.
తీవ్ర ఆరోపణలు ఉన్న దినకరన్ ను అయినా గెలిపిస్తాం కానీ తమిళగడ్డ మీద మోడీ ఆటను సహించేది లేదన్న రీతిలో ఆర్కే నగర్ వాసులు తీర్పు ఇవ్వటం సంచలనంగా మారింది. సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన ట్వీట్ కనిపించింది. దేశంలో ఎక్కడైనా మోడీ ఆటలు సాగుతాయి కానీ.. నమోకు ఏ మాత్రం నమో అనని రాష్ట్రం ఏదైనా ఉందంటే అది తమిళనాడు అన్న అర్థం వచ్చేలా చేసిన ట్వీట్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
ఆర్కే నగర్ ఉప ఎన్నికలో దినకరన్ విజయం తర్వాత పరిణామాలుఎలా మారతాయా? తమిళ రాజకీయం ఏ రూపులోకి తిరగనుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పాలి.
తనకు బలం లేదన్న భావనతో పళని వెంట ఉన్న ఎమ్మెల్యేలు.. తాజా పలితంతో పునరాలోచన చేయొచ్చు. వెనువెంటనే పరిణామాలు మారిపోవు కానీ.. బ్యాక్ గ్రౌండ్ లో దినకరన్ కదిపే పావులు మార్పుకు కారణంగా మారతాయని చెప్పక తప్పదు. ఇక.. జైల్లో శిక్ష అనుభవిస్తున్న చిన్నమ్మకు తాను అనుభవిస్తున్న శిక్ష పెద్దదిగా అనిపించకపోవచ్చు. తమిళ ప్రజలు తన వెంట ఉన్నారన్న దాని ముందు జైలుశిక్ష పెద్ద విషయంగా ఆమెకు అనిపించకపోవచ్చు. ఇంకా చెప్పాలంటే తానున్న పరిస్థితికి ఆమె ఆనందానికి గురి కావొచ్చు. ఎందుకంటే.. తాను జైల్లో ఉండటానికి కారణం రానున్న రోజుల్లో మోడీ వైపు వేలెత్తి చూపేలా తమిళులు భావిస్తే ఆమెకు అంతకు మించి కావాల్సిందేముంది?
ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో డీఎంకేకు తగిలిన ఎదురుదెబ్బ వారికి అయోమయానికి గురి చేయొచ్చు. మోడీతో చేతులు కలిపితే ఫలితం ఎంత తీవ్రంగా ఉంటుందన్న విషయం వారికి అర్థం కావొచ్చు. అయితే.. వెనువెంటనే దిశను మార్చుకోవటం అంత సులువు కాదన్నది వారికి తెలియని విషయం కాదు. ఆ పరిమితులు జైల్లో ఉన్న చిన్నమ్మకు బాగానే తెలుసు. ఓపక్క ఇంట్లో నుంచి తనను తరిమేసిన ఇంటివాళ్ల మీద ఫోకస్ చేసి.. వారి సంగతి చూసేలా చిన్నమ్మ వ్యూహం సిద్ధం చేయొచ్చు. ముందు వారి పని పట్టిన తర్వాత మాత్రమే.. వైరిపక్షమైన డీఎంకే మీద దృష్టి సారించే అవకాశం ఉంది. మొత్తంగా చెప్పాలంటే.. ఆర్కే నగర్ ఫలితం చిన్నమ్మ రిటర్న్స్ అనేలా చేస్తే.. పళని.. పన్నీర్ లకు మాత్రం.. చిన్న మమ్మీ రిటర్న్స్ అన్నది ఖాయం.