Begin typing your search above and press return to search.

త‌మిళ రిసార్ట్ రాజ‌కీయం..మళ్ళీ మొదలు!

By:  Tupaki Desk   |   22 Aug 2017 12:58 PM GMT
త‌మిళ రిసార్ట్ రాజ‌కీయం..మళ్ళీ మొదలు!
X
త‌మిళనాడులో అధికార అన్నాడీఎంకే పార్టీలో నెల‌కొన్న సంక్షోభం ఆరునెల‌ల్లో స‌మ‌సిపోయింద‌ని భావిస్తున్న స‌మయంలోనే మ‌ళ్లీ రాజ‌కీయం ర‌స‌కందాయంలో ప‌డింది. తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి - మాజీ ముఖ్య‌మంత్రి ప‌న్నీర్ సెల్వం వ‌ర్గాలు ఏక‌మైన ప‌రిణామాన్ని జీర్ణించుకోలేని చిన్న‌మ్మ శ‌శిక‌ళ వ‌ర్గం పావులు క‌దుపుతోంది. శ‌శిక‌ళ జైలులో ఉండ‌టంతో ఆమె మేన‌ల్లుడు దిన‌క‌ర‌న్ రంగంలోకి దిగి ప్ర‌భుత్వాన్ని గ‌ద్దె దింప‌డం ల‌క్ష్యంగా పెట్టుకున్నారు. ప‌ళ‌నిస్వామిని ఆ పదవినుంచి తొలగించడానికి తాము చర్యలు తీసుకోనున్నట్లు దినకరన్‌ వర్గం పేర్కొంది.

ఏఐఏడీఎంకె (అమ్మ) వర్గం ప్రధాన కార్యదర్శి శశికళ -దినకరన్‌ వర్గానికి చెందిన తంగతమిళు చెల్వన్‌ మాట్లాడుతూ పళనిస్వామిని మార్చడానికి తాము చర్యలు తీసుకోనున్నట్లు గవర్నర్‌ కు చెప్పామని అన్నారు. కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకోవడానికి తమ వర్గం ఎమ్మెల్యేలు సమావేశం కానున్నారని ఆయన అన్నారు.అయితే ఈ వెంట‌నే ప‌రిణామాలు సైతం మారాయి. గ‌తంలో వ‌లే రిసార్టుల‌లో ఉంచాల‌ని డిసైడ‌య్యారు. అయితే త‌మిళ‌నాడులో ఉంచితే త‌మ అధికార బ‌లంతో సీఎం ప‌ళ‌నిస్వామి వారిని బ‌య‌ట‌కు తీసుకువ‌స్తార‌ని భావించి కొత్త ఎత్తు వేశారు. పొరుగు రాష్ట్రం పుదుచ్చేరిలో ఉంచేందుకు డిసైడ్ అయ్యారు. అయితే ఇక్క‌డికి త‌ర‌లించే క్ర‌మంలో బ‌స్సుల్లో త‌ర‌లిస్తే వారిని అడ్డుకుంటార‌ని ప్రైవేట్ ట్రావెల్స్‌ లో వారిని త‌ర‌లించేందుకు సిద్ధ‌మ‌య్యార‌ని తెలుస్తోంది.

ఇదిలాఉండ‌గా...తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి శాసనసభలో విశ్వాస పరీక్షను ఎదుర్కోవాలని డీఎంకె వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ - ప్ర‌తిప‌క్ష నేత ఎంకే స్టాలిన్‌ డిమాండ్‌ చేశారు. తమకు అందిన సమాచారం ప్రకారం ప్ర‌స్తుత 19 మందికి తోడుగా మరొక ముగ్గురు ఎఐఎడిఎంకె ఎమ్మెల్యేలు పళనిస్వామికి మద్దతు ఉపసంహరించుకున్నారని, దీనితో పళనిస్వామినుంచి విడిపోయిన ఎమ్మెల్యేల సంఖ్య 22కు పెరుగ‌నుందని స్టాలిన్‌ అన్నారు. ఈ కారణంగా పళనిస్వామి శాసనసభలో విశ్వాసపరీక్షను ఎదుర్కోవాలని స్టాలిన్‌ డిమాండ్‌ చేశారు. దిన‌క‌ర‌న్ కుంప‌ట్లు - స్టాలిన్ డిమాండ్ నేపథ్యంలో ప‌రిస్థితులు ఎలా ఉంటాయో అని రాజ‌కీయాల్లో చ‌ర్చ మొద‌లైంది.