Begin typing your search above and press return to search.
అమ్మ గెంటేసినోళ్లందరిని తెస్తున్న చిన్నమ్మ
By: Tupaki Desk | 10 Feb 2017 8:59 AM GMTతమిళనాట నెలకొన్న రాజకీయ పరిస్థితుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పవర్ కోసం చిన్నమ్మ.. పన్నీర్ ల మధ్య నెలకొన్న పోరు వేళ.. తమిళ ప్రజలు చిన్నమ్మను కాకుండా పన్నీర్ ను అభిమానించటం కనిపిస్తుంది. అమ్మకు ఏళ్లకు ఏళ్లు సన్నిహితంగా ఉండటమే కాదు.. ఆమె చివరి రోజుల్లో ఆసుపత్రిలో అమ్మ పక్కనే ఉన్న చిన్నమ్మ పట్ల తమిళులు సానుకూలంగా ఉండరన్నది పెద్ద ప్రశ్న.
వీర విధేయుడనే ముద్ర తప్పించి.. మరింకేమీ ప్రత్యేక లేని.. జనాకర్షకశక్తి లేని పన్నీర్ ను ఓకే అంటున్న తమిళులు.. ఎమ్మెల్యేలంతా వెంట ఉన్నారని చెప్పుకుంటున్న చిన్నమ పక్షాన ఎందుకు నిలవటం లేదు? ఆమె పొడను ఎందుకసలు ఇష్టపడటం లేదు? అన్నది ప్రశ్నగా మారింది. దీనికి సమాధానం వెతికే ప్రయత్నం చేస్తే.. కొత్త కోణం కనిపిస్తుంది. అమ్మ ఎవరినైతే వ్యతిరేకించారో.. ఎవరినైతే పోయెస్ గార్డెన్ నుంచి గెంటేసి.. తన దగ్గరకు వచ్చేందుకు సైతంఇష్టపడలేదో.. అలాంటి వారందరిని చిన్నమ్మ తన చెంతకు చేర్చుకోవటం కనిపిస్తుంది.
ఎవరి దాకానో ఎందుకు.. శశికళ భర్త విషయానికే వద్దాం. ఆయన్ను పోయెస్ గార్డెన్ దరిదాపుల్లోకి వచ్చేందుకు సైతం అమ్మ అంగీకరించేవారు కాదు. ఆమె బతికి ఉన్నంత కాలం తెర మీద కనిపించని ఆయన.. అమ్మ మరణించిన నాటి నుంచి అతనెంత యాక్టివ్ అయ్యారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఆ విషయాన్ని పక్కన పెడితే.. నిన్నటికి నిన్న గవర్నర్ ను కలిసేందుకు వెళ్లిన చిన్నమ్మ పక్కనే ఒక వ్యక్తి కనిపించారు. అందరి దృష్టి అతడి మీద పడటమే కాదు.. దానిపై జోరుగా చర్చలు సాగుతున్నాయి.
ఇంతకీఆ వ్యక్తి ఎవరో కాదు.. శశికళ సొంత మేనల్లుడు టీటీవీ దినకరన్. ఇతగాడిని సైతం అమ్మ బతికి ఉన్నప్పుడు గెంటేశారు. గడిచిన రెండు నెలలుగా శశికళ వెంట ఉంటున్న అతగాడిని.. అమ్మ బతికి ఉన్న రోజుల్లో సమీపానికి కూడా రానిచ్చే వారు కాదు. అలాంటి వ్యక్తి ఇప్పుడు చిన్నమ్మ చెంతనే ఉండటమే కాదు.. కీలకభేటీల్లోనే ఉండటంపై అందరూ గుసగులాడుకునే పరిస్థితి.ఇలా ఎవరినైతే అమ్మ అమితంగా ద్వేషించేదో.. వారిని చిన్నమ్మ దగ్గరకు రానివ్వటం.. పెద్దపీట వేయటం చూస్తే.. తమిళులకు చిన్నమ్మ ఎందుకు నచ్చదో అర్థం చేసుకోవచ్చు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/